ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ క్రేజీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ?, ఎప్పుడు విడుదల అవుతుంది ? అంటూ నందమూరి ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ప్రశాంత్ వర్మ ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు సమాచారం. మరో రెండు నెలలు పాటు మోక్షజ్ఞ చేత రిహార్సల్స్ చేయించి, డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తుంది.
కాగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉంటుందని టాక్. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా రాబోతుంది. ఇప్పటికే, ఈ సినిమాలో నందమూరి మోక్షజ్ఞ సరసన అతిలోక సుందరి ‘దివంగత శ్రీదేవి’ చిన్న కూతురు ఖుషీ కపూర్ నటిస్తున్నట్లు టాక్.
The post రిహార్సల్స్ కి రెడీ అయిన మోక్షు! first appeared on Andhrawatch.com.