గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న తాజా సినిమా “గేమ్ ఛేంజర్”. మరి ఇండియన్ సినిమా దగ్గర టాప్ దర్శకుడు రాజమౌళి అలాగే శంకర్ లతో వర్క్ చేసిన ఏకైక హీరోగా చరణ్ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. అయితే గేమ్ ఛేంజర్ విషయంలో ఏమవుతుందా అని చాలా ఆసక్తి అందరిలో ఏర్పడింది.
తన మార్క్ ఫామ్ లో లేని శంకర్ మళ్ళీ ఈ సినిమా తోనే కం బ్యాక్ ఇస్తారు అని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి చరణ్ సెంటిమెంట్ కూడా వర్క్ అవుతుంది అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. అయితే చరణ్ ట్రాక్ రికార్డు చూసినట్టు అయితే తన కెరీర్ లో కొన్ని ఎపిక్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి.
అలా వందలాది మంది ఎదుట ఒకే ఒక్కడిగా నిలిచే సీన్స్ కి చరణ్ పర్ఫెక్ట్ ఎంపిక అన్నట్టు ఉంటాడు మరి ఇది ‘మగధీర’ నుంచి స్టార్ట్ అయ్యి మొన్న ‘RRR’ వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ నుంచి విడుదల బ్యాక్ షాట్ పోస్టర్ కూడా వాటినే గుర్తు చేస్తుంది. దీంతో మళ్ళీ చరణ్ హిస్టరీ రిపీట్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ తో ఆ సెంటిమెంట్ మళ్ళీ పని చేస్తుందో లేదో అనేది చూడాలి.
The post వంద మంది ముందు ఒకే ఒక్కడు! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
