వారిని టార్గెట్‌ చేస్తూ…బండ్ల గణేష్‌ పోస్ట్‌! | CineChitram

మన టాలీవుడ్ ఆడియెన్స్ లో ప్రముఖ నటుడు అలాగే నిర్మాత కూడా అయిన బండ్ల గణేష్ కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. అంతేకాకుండా  తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద వీరాభిమాని కూడా.. అయితే బండ్ల గణేష్ పలు ఇంటర్వ్యూల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.

సినిమాలకి దూరంగానే ఉన్నారు కానీ తాజా గా సినిమాకి చెందిన కొందరు విషయంలో పెట్టిన ఓ షాకింగ్ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది. తన ఎక్స్ ఖాతా వేదికగా తన అభిమాన రాజకీయ నాయకుడు తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిన్న టాలీవుడ్ సినీ ప్రముఖులు కొందరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

“గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన సినీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు. తెలియజేయడానికి సమయం లేని వారికి పెద్ద నమస్కారం. “టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రమే సీఎం గారు కావలెను”. కొందరిని మాత్రం టార్గెట్ చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. దీంతో టికెట్ రేట్స్ కోసం మాత్రమే సీఎం అవసరాన్ని చూసే ఆ కొందరు నటులు ఎవరు అనే టాక్ నడుస్తుంది.

The post వారిని టార్గెట్‌ చేస్తూ…బండ్ల గణేష్‌ పోస్ట్‌! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …