టాలీవుడ్లో స్టార్ బ్యూటీగా సత్తా చాటిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో నటించింది. ఇక గతకొంత కాలంగా బాలీవుడ్లో బిజీగా మారింది ఈ హాట్ బ్యూటీ. అయితే, సౌత్ సినిమాల్లో అడపదడపా నటిస్తూ అభిమానులను అలరిస్తుంది ఈ స్టార్ హీరోయిన్.
ఇక బాలీవుడ్లో హీరోయిన్గా, ఐటెం సాంగ్స్, వెబ్ సిరీస్.. ఇలా వచ్చిన ప్రతి ఛాన్స్‌ను వినియోగించుకుంటుంది తమన్నా. కాగా బాలీవుడ్ నటుడు వినయ్ వర్మతో తమన్నా గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తోంది. ఈ విషయాన్ని వారు స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు. వారిద్దరు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ సినిమాలో నటించారు. అప్పట్నుంచి వారిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.
పలు ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్‌కు ఇద్దరు కలిసి హాజరయ్యేవారు. ఇక బాలీవుడ్లో హాట్ జోడీగా పేరుతెచ్చుకుంది ఈ ప్రేమజంట. అయితే, ఇప్పుడు వారిద్దరు తమ రిలేషన్‌కు బ్రేకప్ చెప్పినట్లుగా బిటౌన్ మీడియా చెబుతోంది. తమన్నా, వినయ్ వర్మ ప్రస్తుతం రిలేషన్లో లేరని.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకాలం హాట్ జోడీగా ప్రేమలో మునిగితేలిన తమన్నా, వినయ్ వర్మ ఇప్పుడు విడిపోయారనే వార్తతో అభిమానులు షాక్ అవుతున్నారు.
The post విడిపోయారా..? first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
