గత కొంతకాలంగా టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర తరువాత ఏ డైరెక్టర్‌తో సినిమాలు చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. వారు ఊహించినట్లుగా తారక్ చాలా వైవిధ్యమైన డైరెక్టర్లతో కథలు సెట్ చేసుకుని సినిమాలను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ వచ్చే వారం విడుదలకి సిద్దంగా ఉంది.
ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తమిళంలో తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్‌తో ఓ సినిమా చేయాలని ఉన్నట్లుగా తారక్ తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంపై తాజాగా వెట్రిమారన్ కూడా స్పందించారు. తారక్‌తో తాను ఇప్పటికే చర్చలు జరిపానని.. త్వరలోనే ఓ ప్రాజెక్ట్ ప్రకటిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఎన్టీఆర్-వెట్రిమారన్ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి వీరి కాంబో దాదాపు ఫిక్స్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
The post వెట్రీ మారన్ తో ఫిక్స్ అయ్యింది! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
