మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా తన కెరీర్ లో 18వ సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ సినిమా ప్రకటించినప్పటి ఉంచి మంచి హైప్ ని సెట్ చేసుకుంది. ఇక మేకర్స్ ఈ చిత్రం నుంచి నేడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రముఖ సౌత్ నటి ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నట్టుగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ పోస్టర్ లో ఆమె ఏదో ఎడారి ప్రాంతంలో నాగజెముడు మొక్కల ముందు కనిపిస్తుంది. అలాగే ఈ చిత్రంలో ఈమె వసంత అనే పాత్రలో కనిపించబోతుందని సమాచారం.
ఇక ఈ భారీ చిత్రానికి హను మాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహిస్తుండగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది..
The post సాయి తేజ్ సినిమాలోకి ఆ టాలెంటెడ్ హీరోయిన్! first appeared on Andhrawatch.com.