కొంత కాలం క్రితం రెండు రాష్ట్రాల్లో వచ్చిన వరదల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలోనే విపత్తు నుంచి బయటపడేందుకు తమ వంతు సాయం అందించడానికి పలువురు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు ముందుకొచ్చారు.
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రత తో కలిసి టీజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎంతో కలిసి కొన్ని ఫోటోలు దిగారు. మహేష్ చేసిన విరాళం గురించి సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు ప్రముఖ సినీ నటుడు జి.మహేష్ బాబు దంపతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం అందజేశారు. ఏఎంబీ తరపున మరో రూ.10 లక్షల ను అందించారు.
వారికి నా అభినందనలు’ అని తెలిపారు. మహేష్ ఏపీ సీఎం సహాయనిధికి కూడా రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. మహేష్ బాబు చేసిన ఈ సహాయం పునరావాస కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
The post సీఎం ని కలిసిన సూపర్ స్టార్ దంపతులు! first appeared on Andhrawatch.com.