హీరోయిన్ ప్రియాంక మోహన్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది.అసలేం జరిగిందంటే.. తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ ప్రియాంక మోహన్ ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ ప్రారంభోత్సవం సమయంలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ అతిధుల ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిన స్టేజ్ కుప్పకూలిపోవడంతో ఇదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం.
ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినీనటి ప్రియాంక మోహన్, పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి హానుమండ్ల ఝాన్సి రెడ్డి కూడా వచ్చారు. అయితే స్టేజి ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం నుంచి సినీ నటి ప్రియాంక మోహన్ బయటపడిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాలైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డిని మాత్రం హాస్పిటల్ కి తరలించారు. నిజానికి షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదిక పై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలినట్టు చెబుతున్నారు.
The post హీరోయిన్ కి తృటిలో తప్పిన ప్రమాదం! first appeared on Andhrawatch.com.
Cine Chitram Telugu Cinema World
