ప్రముఖ దర్శకుడు మారుతి చేతుల మీదుగా శుక్రవారం `చిన్నారి` టీజర్ విడుదలైంది. ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర సతీమణి ప్రియాంక కీలక పాత్రలో నటించిన చిత్రమిది. బేబి యులీనా పార్థవి, ఐశ్వర్య, మధుసూదన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కె.ఆర్.కె. ప్రొడక్షన్స్, లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె. రవికుమార్, ఎం.ఎం.ఆర్ నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడలో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. లోహిత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ విడుదల చేసిన అనంతరం
మారుతి మాట్లాడుతూ “కన్నడ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ సినిమా టీజర్‌ను చూశాను. చాలా బావుంది. గ్రిప్పింగ్‌గా, స్టైలిష్‌గా ఉంది. బాగా ఖర్చు పెట్టి తీశారని అర్థమవుతోంది. డైరక్టర్ కొత్త వ్యక్తి అయినా చక్కగా డీల్ చేశారని అర్థమవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను“ అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ “ నాకు దర్శకుడిగా తొలి చిత్రమిది. హారర్ జోనర్‌లో చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాం. తల్లీకూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం పూర్తయింది. నవంబర్‌లో విడుదల కానుంది. వేణు కెమెరా పనితనం, రవిచంద్రకుమార్ ఎడిటింగ్ మెప్పిస్తాయి. అజినీష్ లోక్‌నాథ్ మంచి సంగీతం చేశారు“ అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ “హారర్ చిత్రమిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఉంటుంది. గోవా నేపథ్యంలో కథ జరుగుతుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. `రంగి తరంగి`కి సంగీతం చేసిన అజినీష్ లోక్‌నాథ్ చక్కటి బాణీలను ఇచ్చారు. కన్నడలో టాప్ కెమెరామెన్ వేణు ఫోటోగ్రఫీ చేశారు. హాలీవుడ్ స్టైల్ టేకింగ్, ఆర్ .ఆర్ మెప్పిస్తాయి. నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం“ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎడిటర్ రవిచంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.