మేలో మరో సినిమా ఎనౌన్స్ చేయనున్న “ఆకతాయి”

ఆశిష్ రాజ్-రుక్సార్ మీర్ జంటగా వి.కె.ఎ ఫిలిమ్స్ పతాకంపై రామ్ భీమన దర్శకత్వంలో తెరకెక్కిన “ఆకతాయి” చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన యువ కథానాయకుడు ఆశిష్ రాజ్.. మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నారు. “ఆకతాయి” చిత్ర నిర్మాతలైన కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ లు మరో మారు సంయుక్తంగా ఈ తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. 
ఇకపోతే.. మార్చి 10న విడుదలైన “ఆకతాయి”కి సరైన థియేటర్లు దొరకని కారణంగా కొన్ని ఏరియాల్లో విడుదల కాలేదు, అందుకోసం “ఆకతాయి” చిత్రాన్ని కొన్ని ప్రాంతాల్లో మరోమారు విడుదల చేయనున్నారు. 
ఈ సందర్భంగా నిర్మాతలు కె.ఆర్.విజయ్ కుమార్-కె.ఆర్.కౌశల్ కరణ్-కె.ఆర్.అనిల్ కరణ్ మాట్లాడుతూ.. “యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన మా “ఆకతాయి”ని ఆదరించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. ఆ సినిమాకి లభించిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకొనే మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించనున్నాం. ఆగస్ట్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాపులర్ హీరోయిన్ ఆశిష్ రాజ్ సరసన నటించనుంది. ఓ యువ ప్రతిభాశాలిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయనున్నాం. ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అన్నారు!

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …