Ram-Laxman Donated “One Lakh” For Sphoorthi Jyothi Foundation

టాలీవుడ్ లో సీనియర్ మరియు యువ హీరోలందరితోనూ ఫైట్లు, ఫీట్లు చేయించిన రామ్-లక్ష్మణ్ లు ఇండస్ట్రీకి మాత్రమే కాదు సాధారణ ప్రజలకు సుపరిచితులే. కెరీర్ మొదలుపెట్టినప్పట్నుంచి తమకు చేతనైనంతలో తోటివారికి సహాయపడుతూనే వస్తున్న ఈ అన్నదమ్ములు ఈమధ్యకాలంలో ఆ సహాయాన్ని మరింత విస్తృతం చేశారు. తాజాగా.. ఇబ్రాహీం పట్నంలోని అంధ బాలబాలికల సహాయార్ధం మానవీయ ధృక్పధంతో జ్యోతి స్థాపించిన  “స్పూర్తి జ్యోతి ఫౌండేషన్”కు బాసటగా నిలిచారు రామ్-లక్ష్మణ్ లు. 
నేడు (సెప్టెంబర్ 13) మద్యాహ్నం ఇబ్రాహీం పేటలోని ఫౌండేషన్ కార్యాలయంలో సంస్థ నిర్వహకురాలు జ్యోతికి రామ్-లక్ష్మణ్ లు లక్ష రూపాయల చెక్ ను అందించారు. 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “ఓ రెండు నెలల క్రితం ఈ దారిలో ఒక షూటింగ్ కు వెళుతుండగా.. మార్గమధ్యంలో ఈ ఫౌండేషన్ బోర్డ్ ను చూడడం జరిగింది. అంధ బాలబాలికలకు సహాయం చేస్తున్నారని తెలిసి వెంటనే ఆఫీస్ కి వెళ్ళి వారిని కలిశాం. వారి ఫౌండేషన్ డెవలప్ మెంట్ కోసం నేడు మా అన్నదమ్ముల తరపున లక్ష రూపాయలు అందజేయడం మాకు మానసిక సంతృప్తిని కలిగించింది. ఇక నుంచి మాకు చేతనైనంతలో ఈ ఫౌండేషన్ సహాయం చేస్తూనే ఉంటాం” అన్నారు!

About CineChitram

Check Also

సూపర్ స్టార్ కృష్ణ నరేష్ నవీన్ లను కలిసిన అభిమానులు

కువైట్ లో 8 సంవత్సరాలు గా  డిజైన్ వృత్తిలో  ప్రాముఖ్యత ను అందిపుచ్చుకున్న గుంటూరు ప్రాంత వాసి హుస్సేన్ మొహమ్మద్ …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading