ఈ నెల 23న వస్తున్న ఎరోటిక్ సస్పెన్స్‌ థ్రిల్లర్  ‘రెడ్’

 కన్నడలో ఘన విజయం సాధించిన ‘రెడ్‌’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య..  ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో పెద్ద విజయం సాధించింది.

నిర్మాత భరత్‌ మాట్లాడుతూ…  ‘ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన  రాజేష్‌మూర్తి..  ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ..   ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ ‘రెడ్’. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సెన్సార్ తో పాటు అన్ని ఏరియాలు బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం”‘ అన్నారు. 

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అంజన్‌, పబ్లసిటీ డిజైనర్: వెంకట్.ఎం, నిర్మాత: భరత్‌, సంగీతం-దర్శకత్వం: రాజేష్‌మూర్తి.

 

About CineChitram

Check Also

నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన “అమీ తుమీ” టీజర్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading