సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానుల‌ స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగిన `ధృవ` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా  గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్  సంయుక్తంగా నిర్మిస్తోన్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ధృవ‌`.   ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను హైద‌రాబాద్ యూస‌ఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో అభిమానుల స‌మ‌క్షంలో గ్రాండ్‌గా నిర్వ‌హించారు. 
 
చ‌ర‌ణ్ ల‌క్కీ నెంబ‌ర్ 9..సినిమా హిట్ ఖాయం
 
చ‌ర‌ణ్ నాకు మంచి మిత్రుడు. చ‌ర‌ణ్ కంటే ముందు చిరంజీవిగారు నాకు మంచి మిత్రుడు. 2009 శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో గెలిచిన‌ప్పుడు శాస‌న‌స‌భ‌లో ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. నిర్మ‌ల‌మైన వ్య‌క్తి చిరంజీవిగారు. అదే ల‌క్ష‌ణాలు చర‌ణ్‌లో క‌న‌ప‌డుతున్నాయి. తండ్రి మెగాస్టార్‌, బాబాయ్ ప‌వ‌ర్‌స్టార్‌, చ‌ర‌ణ్ మెగాప‌వ‌ర్ స్టార్‌. చ‌ర‌ణ్ చాలా టాలెంటెడ్‌. ఈ సినిమా చ‌ర‌ణ్‌కు తొమ్మిదో సినిమా. చ‌ర‌ణ్ ల‌క్కీ నెంబ‌ర్‌, కారు నెంబ‌ర్‌, పుట్టిన నెంబ‌ర్ అంతా కూడా తొమ్మిదే వ‌స్తుంది. ఈ సినిమా కూడా డిసెంబ‌ర్ 9నే వ‌స్తుంది. ఇవ‌న్నీ చూస్తుంటే హిట్ ఖాయం. చ‌ర‌ణ్‌ ప‌డ్డ క‌ష్టం చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఈ సినిమా త‌న‌కు చాలా పెద్ద హిట్ మూవీ కావాల‌ని కోరుకుంటున్నాను. అర‌వింద్‌స్వామిగారు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. చ‌ర‌ణ్‌, అర‌వింద్‌, ప్ర‌సాద్‌, సురేంద‌ర్‌రెడ్డి, ర‌కుల్ స‌హా అంద‌రికీ  ఆల్ ది బెస్ట్ అని తెలంగాణ ఐ.టి.మినిష్ట‌ర్ .కె.టి.ఆర్‌. అన్నారు. ఈ సినిమా స‌క్సెస్ వేడుక‌న‌ను వైజాగ్‌లో నిర్వ‌హించాల‌ని, గంటాశ్రీనివాస‌రావుగారు పిలిస్తే త‌ప్ప‌కుండా వైజాగ్ వ‌స్తాన‌ని చెప్పి అభిమానుల‌ను అల‌రించారు. 
 
మ‌గ‌ధీర‌లా ధృవ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలి
 
గంటా శ్రీనివాస‌రావు మాట్లాడుతూ – “మెగాస్టార్ చిరంజీవిగారికి వార‌సుడుగా రాంచ‌ర‌ణ్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత హీరోగానే కాకుండా, అంద‌రితో క‌లిసి ఉండే త‌న వ్య‌క్తిత్వాన్నిఅంద‌రూ అభినందించాల్సిందే. గీతాఆర్ట్స్‌లో మ‌గ‌ధీర ఎలాగైతే కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిందో, ఆ రికార్డుల‌ను ధృవ బ‌ద్ధ‌లు కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా స‌క్సెస్ మీట్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవిగారి ఖైదీ నంబ‌ర్ 150 సినిమా వేడుక‌ను కూడా వైజాగ్‌లో సెల‌బ్రేట్ చేయాల‌ని కోరుకుంటున్నానని గంటా శ్రీనివాస‌రావు తెలిపారు.
 
అభిమానుల కోస‌మే ఈ క‌ష్టం
 
రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. బ్యాన‌ర్‌లో మ‌గ‌ధీర త‌ర్వాత సినిమా చేయ‌లేదు. అందుకు కార‌ణం అంత మంచి క‌థ నాకు దొర‌క‌లేదు. అయితే ఇప్పుడు ధృవ సినిమా చేశాను. అందుకు ముందు థాంక్స్ చెప్పాల్సింది ప్ర‌సాద్‌గారికి ఈ  సినిమాను ఆయ‌నే ముందు నా వ‌ద్ద‌కు తెచ్చారు. ఆయ‌నతో గ‌తంలో ర‌చ్చ వంటి సూప‌ర్‌హిట్ మూవీ చేశాను. ధృవ సినిమాకు అర‌వింద్‌గారితో, ప్ర‌సాద్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. సురేంద‌ర్‌రెడ్డిగారితో చాలా ట్రావెల్ చేశాం. ఏ క‌థ  చేద్దామ‌నుకున్నాం. కానీ ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నందుకు సురేంద‌ర్‌రెడ్డిగారికి థాంక్స్‌. ముందు రీమేక్ చేయ‌మ‌న‌గానే ఆయ‌న కాస్తా ఆలోచించినా చివ‌ర‌కు ఒప్పుకుని త‌మిళం కంటే తెలుగులోనే సినిమాను బాగా చేసి ఇచ్చారు. ఈ సినిమాలో ప్ర‌తి ఒక్క‌రి క‌ష్టంతోనే సినిమా ఇంత స్ట‌యిలిష్‌గా వ‌చ్చింది.  సాధార‌ణంగా ఏ హీరో అయినా వారి అభిమానుల‌ను అల‌రించ‌డానికి క‌ష్ట‌ప‌డ‌తారు. నేను కూడా అలానే క‌ష్ట‌ప‌డ్డాను త‌ప్ప కొత్త‌గా ఏం చేయ‌లేదు. ఈ సినిమాకు క‌ష్ట‌ప‌డ‌క‌పోతే త‌ప్పు.  నాన్న‌గారి ఖైదీ నంబ‌ర్ 150 వ‌స్తుంది. ఆయ‌న లేని టైంలో మేం అలా ఇలా ఉంటే ఒకే. కానీ ఇప్పుడు ఆయ‌న మ‌ళ్లీ వ‌చ్చి ఒక స్టాండ‌ర్డ్ సెట్ చేసి బెత్తం ప‌ట్టుకుని న‌డిపించ‌డానికి మ‌ళ్లీ వ‌స్తున్నారు. ఆయ‌న రావ‌డంతో ఇంకా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో క‌ష్ట‌ప‌డ‌తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేస్తున్నాను. డిసెంబ‌ర్ 9న అన్నీ కుదిరితే నాన్న‌గారి 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 సినిమా టీజ‌ర్ ధృవ థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి మేం ప్లాన్ చేస్తున్నాం. మనం ఇత‌రుల‌కు ఏమిస్తే అదే మ‌న‌కు తిరిగొస్తుంది. కానీ సినిమా ఇండ‌స్ట్రీలో మేం అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తే అభిమానుల‌ను తిరిగి మ‌మ్మ‌ల్ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని కాకుండా మాకు పేరు, డ‌బ్బు, గౌర‌వం ఇస్తారు. ఇండ‌స్ట్రీలో పుట్టినందుకు, ఇలా న‌టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స‌పోర్ట్ చేస్తున్న‌ థాంక్స్ అని తెలిపారు. అంతే కాకుండా చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబ‌ర్ 150 సినిమా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 
 
చ‌ర‌ణ్‌ది ఓ ప్ర‌త్యేక స్థానం
 
రాంచ‌ర‌ణ్ హీరోగా ఒక్కొక్క మెట్టు పెకెదుగుతూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మ‌న ముఖ్య‌మంత్రి ఆధ్వ‌ర్యంలో సినిమా ప‌రిశ్రమ బావుండాల‌ని ప్ర‌భుత్వ పరంగా అనేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అల్లు అర‌వింద్‌గారు అనేక చిత్రాలు చేశారు. ఆరోజుల్లో చిరంజీవిగారితో ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు చ‌ర‌ణ్‌, అల్లుఅర్జున్‌తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ధృవ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నానని తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ అన్నారు.
 
మెమ‌ర‌బుల్ జ‌ర్నీ
 
సినిమా విజ‌యాని కంటే ఆ జ‌ర్నీబావుండాల‌ని నేను న‌మ్ముతాను. ఫలితం ప్రేక్ష‌కుల‌దే. దృవ జ‌ర్నీ మ‌ర‌చిపోలేను. చ‌ర‌ణ్‌, సురేందర్ రెడ్డిగారు, అర‌వింద్‌గారు, ఎన్‌.వి.ప్ర‌సాద్‌గారు, ర‌కుల్‌, ఫ‌రా, పోసాని స‌హా అంద‌రూ దృవ జ‌ర్నీని అంద‌రూ నాకు మెమర‌బుల్  చేశారు. రీమేక్ చేయ‌డంలో రెండు విధానాలున్నాయి. అందులో ఒక‌టి ఎలా ఉంటే అలానే చేసేయ‌డం అయితే రెండ‌వ‌ది సినిమాను ఇంప్ర‌వైజ్ చేస్తూ సినిమాను తీయ‌డం. ఆ విష‌యంలో సురేంద‌ర్‌రెడ్డిగారిని అభినందిస్తున్నాను. చ‌ర‌ణ్ డేడికేష‌న్‌, హార్డ్ వ‌ర్క్‌ను స్క్రీన్‌పై చూస్తారు. త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారని అర‌వింద్ స్వామి అన్నారు. 
 
రెగ్యుల‌ర్ మూవీ కాదు..కొత్త‌గా ఉంటుంది. 
 
ధృవ రెగ్యుల‌ర్ సినిమా కాదు. కొత్త‌గా ఉంటుంది. కొత్త‌గా చేయాల‌ని చ‌ర‌ణ్ సినిమా చేయాల‌ని ఈ సినిమాను సెల‌క్ట్ చేసుకుని నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇచ్చారు. మొద‌టి రోజు నుండి నాకు ఒక మంచి టీంను కూడా ఇచ్చాడు. అంత మంచి టీం ఉండ‌బ‌ట్టే సినిమా బాగా వ‌చ్చింది. మ‌న‌కు క‌న‌ప‌డే చ‌ర‌ణ్ వేరు. త‌న హార్ట్ వేరు. ఈ సినిమాతో చ‌ర‌ణ్ లాంటి మంచి ద‌య గ‌ల వ్య‌క్తిని, ఫ్రెండ్‌ను సంపాదించుకున్నాను. అర‌వింద్‌గారు, వినోద్‌, హిప్‌హాప్ త‌మిళ స‌హా అంద‌రూ డేడికేష‌న్‌తో ఈ సినిమా కోసం వ‌ర్క్ చేశారు. నిర్మాతలు అర‌వింద్‌, ప్ర‌సాద్‌గారి వ‌ల్లే సినిమా చాలా బాగా వ‌చ్చింద‌ని డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి తెలిపారు. 
 
చ‌ర‌ణ్ నుండి అభిమానులు కోరుకునే సినిమా
 
త‌మిళంలో త‌ని ఒరువ‌న్ సినిమా విడుద‌ల కాగానే చ‌ర‌ణ్‌గారికి ఫోన్ చేసి సినిమా చూడ‌మ‌ని చెప్పాను. సినిమా చూసిన చ‌ర‌ణ్‌గారు రెండు రోజుల్లోనే సినిమాలో యాక్ట్ చేస్తాన‌న్నారు. ఈ సినిమా త‌మిళ సినిమా హ‌క్కుల కోసం చాలా మంది పోటీలు ప‌డ్డారు. నేనే రీమేక్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాను. అలాగే చ‌ర‌ణ్‌గారితో ఈలోపు చాలా మంది సినిమాలు చేయాల‌ని పోటీ ప‌డ్డా, చ‌ర‌ణ్‌గారు ప్ర‌సాద్‌గారితో సినిమా చేస్తాన‌ని అన్నారు. అలాగే సురేంద‌ర్‌రెడ్డితో సినిమా చేయాల‌ని హీరోగారు అనుకోవ‌డంతో ధృవ‌ సినిమా స్టార్ట్ అయ్యింది. చాలా మంచి సినిమా, గొప్ప సినిమా. అభిమానులు చ‌ర‌ణ్ నుండి ఏం కోరుకుంటారో అవ‌న్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అర‌వింద్‌స్వామిగారు త‌మిల్‌లో చేశారు. అయ‌న్ను గ‌ట్టిగా ఒప్పించి తెలుగులో చేయించాం. ఇది ఆయ‌న‌కు ఒక రీ ఎంట్రీలా ఉంటుంది. ఇందులో అర‌వింద్‌గారు ఇందులో విల‌న్‌గా చేశార‌ని అంద‌రూ అంటున్నారు కానీ సినిమా రెండు క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య న‌డిచే క‌థ‌. సురేంద‌ర్‌రెడ్డి అండ్ టీం సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. అర‌వింద్‌గారితో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుందని ఎన్‌.వి.ప్ర‌సాద్ అన్నారు. 
 
ఈ ఏడాదిలోనే పెద్ద సినిమా కావాలి
 
ద‌గ్గుబాటి రానా మాట్లాడుతూ – “దృవ ఈ ఏడాదిలోనే పెద్ద సినిమా అవుతుంది. మోడ్ర‌న్ కంటెంప‌ర‌రీ సినిమాలో ఇదొక బాహుబ‌లి వంటి సినిమా. న‌చ్చిన వ్య‌క్తులంద‌రూ క‌లిసి చేసిన సినిమా. ఈ సినిమా ఘ‌న విజ‌యం సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేయాల‌ని కోరుకుంటున్నాను. అర‌వింద్‌స్వామిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఆయ‌న్ను స్వాగతిస్తున్నాం“ అన్నారు.
 
చ‌ర‌ణ్ క‌థ‌పై న‌మ్మ‌కంతో చేస్తున్న సినిమా
 
త‌మిళంలో త‌ని ఒరువ‌న్ సినిమా చూసి స్పెల్ బౌండ్ అయ్యాను. ఆ సినిమాలో హీరో, విల‌న్ అని కాకుండా రెండు క్యారెక్ట‌ర్స్ ఉంటాయి. క‌థ‌ను నమ్మి సినిమా చేసిన చ‌ర‌ణ్‌కు హ్యాట్సాఫ్‌. ఓ రీమేక్ సినిమాను క‌థ‌ను అడాప్ట్ చేసుకుని సినిమా తీయ‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. సురేంద‌ర్‌రెడ్డికి ఆల్ ది బెస్ట్‌. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, హిప్ హాప్ త‌మిళ, పి.ఎస్‌.వినోద్ స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్ అని వంశీ పైడిప‌ల్లి అన్నారు. 
 
డిసెంబ‌ర్‌లో కొడుకు…జ‌న‌వ‌రిలో తండ్రి
 
ధృవ సినిమా కోసం చ‌రణ్ ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. రాత్రి ఒంటి గంట వ‌ర‌కు సినిమా కోసం ఎక్స‌ర్‌సైజులు చేశారు. డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి అడిగాడ‌ని చ‌ర‌ణ్ క‌ష్ట‌ప‌డితే సురేంద‌ర్‌రెడ్డి అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా త‌మిళం కంటే తెలుగులో సినిమాను తెరకెక్కించారు. హిప్ హాప్ త‌మిళ‌, అర‌వింద్‌స్వామిగారికి అంద‌రికీ అభినంద‌న‌లు. డిసెంబ‌ర్‌లో కొడుకు సినిమా చూడండి. జ‌న‌వ‌రిలో తండ్రి సినిమా చూడండని వి.వి.వినాయ‌క్ తెలిపారు.  
 
గొప్ప వ్య‌క్తిత్వ‌మున్న వ్య‌క్తి
 
చ‌ర‌ణ్ చిన్న చిన్న ప్రామిస్‌ల‌ను కూడా నిల‌బెట్టుకునే వ్య‌క్తిత్వ‌మున్న వ్య‌క్తి. సురేంద‌ర్ రెడ్డి నా ఫ్రెండ్‌. హీరోల‌ను ప్ర‌త్యేకంగా చూపించ‌డంలో త‌న‌ది ప్ర‌త్యేక స్టైల్‌. సినిమా బావుంద‌ని తెలిసింది. సినిమా పెద్ద హిట్ కావాలని, గీతాఆర్ట్స్ లో ధృవ మ‌రో పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నానని సుకుమార్ చెప్పారు. 
 
లుక్‌లో స‌గం స‌క్సెస్ క‌న‌ప‌డుతుంది
 
ధృవ‌లో చ‌ర‌ణ్ పోలీస్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. పోలీస్ అంటే న‌మ్మ‌కం. ఈ న‌మ్మ‌కం వ్య‌క్తి లుక్ నుండే వ‌స్తుంది. లుక్ కోసం చ‌ర‌ణ్ బాబు చేసిన తీరు, క్యారెక్ట‌ర్‌లో ఇన్‌వాల్వ్ అయిన తీరు అద్భుతం. ఆ లుక్‌లోనే స‌గం స‌క్సెస్ క‌న‌ప‌డుతుంది. ర‌కుల్ చాలా హార్డ్ వ‌ర్కింగ్ హీరోయిన్‌. అర‌వింద్ స్వామిగారు హీరోగానే కాదు, విల‌న్‌గా కూడా స‌క్సెస్ అయ్యారు. చిరంజీవిగారు ఖైదీలా న‌టిస్తున్నారు. ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌న్నా, అందుకోవాల‌న్నా అషామాషీ విష‌యం కాదు. వేరు గ‌ట్టిదైతే ఉంటే చెట్టు బలంగా ఎదుగుతుంది. ఆ చెట్టు ఎంతో మంది ఎద‌గ‌డానికి దోహ‌దప‌డుతుంది. దానికి బెస్ట్ ఎగ్జామ్‌పుంల్ చిరంజీవిగారు. ఆయ‌న ఎదుగుతూ ఓ అద్భుత‌మైన ఫ్లాట్‌ఫాం వేశారు. మ‌ధ్య‌లో కాసేపు రెస్ట్ తీసుకున్నారంతే. మ‌ళ్లీ ట్విస్ట్ ఇవ్వ‌డానికి వ‌స్తున్నారు. అదే ఖైదీ నంబర్ 150. ధృవ‌తో పాటు ఖైదీ నంబ‌ర్ 150 పెద్ద హిట్టై ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడాల‌ని కోరుకుంటున్నాను. గీతాఆర్ట్స్ మేకింగ్ వాల్యూస్ అద్భుతం. క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడుకి చాలా ఫ్రీడ‌మ్ ఇస్తారు. అల్లు అర‌వింద్‌గారు సినిమాను అద్భుతంగా చేయించుకుంటారు. డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి చాలా క్లారిటీ ఉన్న డైరెక్ట‌ర్‌. ఈ సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ సాధించాల‌ని కోరుకుంటున్నానని డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను చెప్పారు. 
నిర్మాత‌ల‌కు లాభాల‌ను తెచ్చి పెట్టాలి. హిప్‌హాప్ త‌మిళ సంగీతం కొత్త‌గా ఉంది. అర‌వింద్‌గారు గ‌త నాలుగైదు సినిమాల నుంచి హిట్లు కొడుతూనే ఉన్నారు. ఈ సినిమాకు కూడా అదే పంథాలో పెద్ద హిట్ కొట్టాలి. ఈ టీమ్ అంద‌రికీ పేరు, డ‌బ్బు రావాలి. మా అభిమానుల‌కు ఈ సినిమా ఆనందాన్నివ్వాలి. మా అన్న‌య్య సినిమా విష‌యానికి వ‌స్తే ఆయ‌న ఇంకో సినిమా చేయాల‌ని కోరుకున్న తొలి వ్య‌క్తిని నేనే. ఆయ‌న ఖైదీ నెంబ‌ర్ 150 సినిమా ఒప్ప‌కున్న‌ప్పుడు చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. ఆయ‌న లుక్ కి, చ‌ర‌ణ్ లుక్‌కి పెద్ద తేడా అనిపించ‌లేదు. మా అన్న‌య్య కూడా తెగ ఎక్స‌ర్‌సైజులు చేస్తున్నార‌ని విన్నాను. ఈ మ‌ధ్య ఆయ‌న్ని క‌ల‌వ‌డం కుద‌ర‌లేదు. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంద‌ని నాగ‌బాబు చెప్పారు. ధృవ సినిమాలో చ‌ర‌న్ అందంగా, మాస్ హీరోలా క‌నిపిస్తాడు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. పాట‌లు అల్రెడి పెద్ద హిట్ సాధించాయి. సురేంద‌ర్‌రెడ్డి, హిప్ హాప్ త‌మిళ‌, అర‌వింద్ స్వామిగారికి అంద‌రికీ కంగ్రాట్స్ అని డా.వెంక‌టేశ్వ‌ర‌రావు అన్నారు. ధృవ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. చిరంజీవిగారి వ‌ద్ద ఉన్న హార్డ్ వ‌ర్క్‌, క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర‌ణ్‌లో, మెగా హీరోలంద‌రిలో ఉన్నాయి. ధృవ పెద్ద హిట్ కావాల‌ని శేఖ‌ర్ రెడ్డి అన్నారు. 
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అతిథులంద‌రూ యూనిట్‌ను అభినందించారు.

Stills

About CineChitram

Check Also

చెన్నై లో మిక్చర్ పొట్లం ప్రీమియర్ షో

శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్ర పోషించిన మిక్చర్ పొట్లం చిత్రం ఈనెల 19న రిలీజ్ కి సిద్ధమైంది . సీనియర్ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading