2016 లో వరుసగా ” సరైనోడు, శ్రీరస్తు శుభమస్తు, ధృవ ” లాంటి హ్యట్రిక్ సూపర్‌హిట్స్ తో దూసుకుపోతున్న గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా GA 2 బ్యానర్ లో భలేభలేమగాడివోయ్ లాంటి చిత్రం తరువాత నిర్మాత బన్నివాసు మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో మంచి కమర్షియల్ ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా విజయాన్ని సాధించిన’ శ్రీరస్తు శుభమస్తు’ దర్శకుడు పరుశురాం(బుజ్జి) దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్నచిత్రంగా విడుదలయ్యి ట్రెండింగ్ సక్సస్ ని సొంతం చేసుకున్న పెళ్ళిచూపులు చిత్రంతో అందరి అభిమానాన్ని గెలుచుకున్న విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నారు. బన్ని వాసు నిర్మాతగా నాగచైతన్య తో ‘100%లవ్’, సాయిధరమ్‌తేజ్ తో ‘పిల్లా నువ్వులేని జీవితం’, నాని తో ‘భలే భలే మగాడివోయ్’ ఇప్పడు విజయ దేవరకొండ తో నిర్మిస్తున్నారు.
నిర్మాత బన్ని వాసు మాట్లాడుతూ” శ్రీ అల్లు అరవింద్ గారు నిర్మాత గా 2016 లో నిర్మించిన మూడు చిత్రాలు సూపర్‌హిట్స్ కావటం చాలా హ్యపిగా వుంది. ‘ శ్రీరస్తు శుభమస్తు ‘ చిత్ర దర్శకుడు పరుశురాం గారు చాలా మంచి కథ చేప్పారు. ఈ కథ విన్నవెంటనే అరవింద్ గారికి చాలా నచ్చింది. వెంటనే నాకు వినిపించారు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ చిత్ర కథ మాకు నచ్చింది. ఆల్‌రెడి మా బ్యానర్ లో మంచి సక్సస్ ని ఇచ్చిన దర్శకుడు కావటంతో ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అనేశాము. పరుశురాం గారి కథ కంటే విజన్ సూపర్ వుంటుంది. చాలా చిత్రాలు ప్రూవ్ అయ్యాయి కూడా.. మా బ్యానర్ లో వరుసగా రెండో చిత్రం కూడా చేయ్యటం మాకు ఆనందంగా వుంది. భలేభలేమగాడివోయ్ లాంటి సూపర్‌డూపర్ హిట్ తరువాత GA2 బ్యానర్ లో గ్యాప్ తీసుకున్నాము. GA2 లో చేస్తే ఆరేంజి విజయాన్ని సాధించే చిత్రాలు చేయ్యాలనే ధృఢసంకల్పంతో గ్యాప్ తీసుకున్నాము. ఇప్పడు ఈ కథ ఆరేంజి లో వుందనే నమ్మకంతో ఈ సంవత్సరంలో షూటింగ్ చేయడానికి సిధ్ధమయ్యాము. ఈ చిత్రంలో ‘ పెళ్ళిచూపులు’ హీరో విజయ్ దేవర కొండ చేస్తున్నారు. అల్లు అరవింద్ గారు సమర్పణలో ఈ చిత్రం అతి త్వరలో సూపర్ టెక్నిషియన్స్ తో భారీ తారాగాణం తో సెట్స్ మీదకి వెళ్ళనుంది.” అని అన్నారు.