జె.డి.చక్రవర్తి, అక్షత హీరో హీరోయిన్లుగా నక్షత్ర మీడియా ప్రొడక్షన్ బ్యానర్‌పై కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్ సారథి స్టూడియోలో ప్రారంభమైంది. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో నక్షత్ర రాజశేఖర్ నిర్మాతగా సినిమా రూపొందనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో….
దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ – సినిమా దర్శకత్వం చేసి చాలా గ్యాప్ వచ్చింది. అయితే వస్తే చాలా మంచి సినిమాతోనే రావాలని పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమా చేస్తున్నాను. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తున్నాం. రణం సినిమాలో గోపీచంద్ ఎంత బాగా యాప్ట్ అయ్యాడో ఈ సినిమాలో కథకు జె.డి.చక్రవర్తిగారు అంతలా యాప్ట్ అవుతారు. జె.డి గారు నన్ను డ్యాన్స్ మాస్టర్‌గా పరిచయం చేసిన గురువుగారు. అలాగే నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. అంజిశ్రీను సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అవుతాయి.. అని అన్నారు.
జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ – అమ్మ రాజశేఖర్ కథ చెప్పగానే నేను కొన్ని కరెక్షన్స్ చెప్పాను. తను నేను చెప్పిన చేంజస్‌తో సినిమాను అద్భుతంగా రాసుకుని వచ్చాడు. కథపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అమ్మ రాజశేఖర్ భావాన్ని గొప్పగా చెప్పగల దర్శకుడు. రామ్‌గోపాల్‌వర్మగారి వద్ద పనిచేసిన అంజి శ్రీను ఈసినిమాకు సినిమాటోగ్రఫీ చేయడం, థమన్ మ్యూజిక్ అందించడం హ్యాపీగా ఉంది..అన్నారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ అంజి శ్రీను, శ్రీరామ్‌చంద్ర, హీరోయిన్ అక్షత తదితరులు పాల్గొన్నారు.
Tags amma amma rjashekhar jd jd chakravarthi rajasekhar
Check Also
మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …