పులికొండ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1గా నల్లూరి శ్రావణ్ దర్శకత్వంలో రామ్, వరుణ్, దివ్య, ప్రియా హీరో హీరోయిన్లుగా యువ నిర్మాత రామ్ నిర్మిస్తున్న eనాడు సినిమా పూజా కార్యక్రమాలు ఈ నెల 28శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం స్క్రిప్టును తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య అందించారు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి క్లాప్ నివ్వగా దర్శకనిర్మాత మద్దినేని రమేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత రామ్ మాట్లాడుతూ.. ‘సినిమా మీద నాకున్న ప్యాషన్ తో దర్శకుడు శ్రావణ్ చెప్పిన కథ నచ్చి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. రామోజీరావు గారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆ గౌరవంతోనే కధకు యాప్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఫిబ్రవరి రెండవ వారంలో షూటింగ్ స్టార్ట్ చేసి ఏప్రిల్ లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.
దర్శకుడు నల్లూరి శ్రావణ్ మాట్లాడుతూ.. ‘ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా సాగే థ్రిల్లర్ మూవీ ఇది. ఇప్పటి జనరేషన్ కి అనుగుణంగా యూత్ నెట్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. దాని దృష్టిలో పెట్టుకుని నేటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే కధాంశంతో ఈ చిత్రాన్ని తెరక్కేక్కిస్తున్నాం. ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రకు ప్రముఖ హీరోయిన్ ను ఎంపిక చేస్తున్నాం. తాను ఎవరనేది త్వరలో ఎనౌన్స్ చేస్తాం. అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. అంత అద్భుతమైన స్క్రిప్ట్ ఈ చిత్రానికి సమకూరింది. నాకు ఇంట మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రామ్ గారికి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు.
ఈ సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉందని, తప్పకుండ మా కెరీర్ కు మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు హీరోహీరోయిన్లు వరుణ్, దివ్యా. సంగీతదర్శకుడు శివ నందిగం మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో 5పాటలు ఉన్నాయి. వేటికవే అన్ని వర్గాల వారిని అలరించేలా సిట్యుయేషన్ అనుగుణంగా ఉంటాయి’ అన్నారు. ఇంకా ఈ సమావేశంలోమాటల రచయిత తిరుమల నాగ్ కూడా పాల్గొన్నారు. రామ్, వరుణ్, దివ్య, ప్రియా, మహేష్, అప్పారావు, బేబీ బిందు, బేబీ నవ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: రామాంజనేయులు, కరుణాకర్, ,మాటలు: తిరుమల నాగ్, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్దవ్, ఆర్ట్: ఈ.రామకృష్ణ, సంగీతం: శివ నందిగాం, డీఓపీ: ఎస్.జె.సిద్ధార్హ్డ్, నిర్మాత: పులికొండ రామ్, దర్శకత్వం: నల్లూరి శ్రావణ్.