వరం, తన్యారెడ్డి, సుమన్‌శెట్టి, చలపతిరావులు ప్రధాన పాత్రధారులుగా ప్రణీత్ పండగ దర్శకత్వంలో గీతా టాకీస్ బ్యానర్‌పై పరమ గీత సమర్పణలో వైష్ణవి నిరంజన్ నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ప్రొడక్షన్ నెం1’ శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయింది. నటులు చలపతిరావు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చలపతిరావు మాట్లాడుతూ.. దర్శకుడు ప్రణీత్ నాకు చాలా కాలంగా తెలుసు. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. కొత్త పాత నటుల కలయిలో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి. కొత్త పాయింట్‌తో వచ్చే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాలు సాధించాయి. ఆ కోవలోనే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రణీత్‌కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు. కథానాయకుడు వరం మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. దర్శకుడు ప్రణీత్ గారు మంచి సబ్జెక్ట్ తయారు చేసుకున్నారు. మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులు కూడా ఆదరించాలని ప్రార్ధిస్తున్నా అన్నారు. హీరోయిన్ మాట్లాడుతూ.. ఈ అవకాశం రావడం నిజంగా నా లక్ అని చెప్పాలి. మంచి రోల్ చేస్తున్నా. తప్పకుండా నాకు పేరు తెచ్చే చిత్రం అవుతుంది. మీ ఆడపడుచుగా భావించి ఆదరించాలని ప్రేక్షకులను కోరుతున్నా. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు. చిత్ర దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ.. ‘జయం’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యాను. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించడం ద్వారా ప్రేక్షకులకు సుపరితుడిగా ఉన్నాను. పాత, కొత్త నటుల కలయిలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. రెండు క్యారెక్టర్లు ఈ చిత్రాన్ని నడిపిస్తాయి. ఇద్దరు ప్రముఖ నటులు నటిస్తున్నారు. పల్లెటూరు వాతావరణంలో సినిమా ఉంటుంది. చిక్మంగళూరు, వైజాగ్, హైదరాబాద్ వంటి పలు ప్రదేశాల్లో షూటింగ్ జరుపుతాం. మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నాం. చిన్న సినిమా అయినప్పటికీ కథ డిమాండ్ మేరకు ఖర్చుకు వెనకాడవద్దని నిర్మాత చెప్పడం చాలా ధైర్యాన్నిచ్చింది. మీడియా సోదరులు కూడా మాకు సపోర్ట్‌గా నిలవాలని కోరుకుంటున్నా అన్నారు.
వరం, తన్యారెడ్డి, చలపతిరావు, సమన్శెట్టి, సిడ్నీ భాషా, ఫణి, సాయికిరణ్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహేష్ ధీర, కెమెరా: రాహుల్ మాచినేని, డ్యాన్స్: పాల్, సమర్పణ: పరమ గీత, నిర్మాత: వైష్ణవి నిరంజన్, కథ, మాటలు, దర్శకత్వం: ప్రణీత్ పండగ.