భద్రాద్రి మూవీస్ `కత్తిలాంటి కుర్రాడు` ప్రారంభం

భద్రాద్రి మూవీస్ బ్యానర్‌పై విసుశ్రీ, అక్ష, హ‌మీదా హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం క‌త్తిలాంటి కుర్రాడు విజ‌య‌ద‌శమి సంద‌ర్భంగా  హైద‌రాబాద్‌లో లాంచ‌నంగా ప్రారంభమైంది. . తొలి స‌న్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్ట‌గా, నిర్మాత ఎల్‌.నాని కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇ.స‌త్తిబాబు ముహుర్త‌పు స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.జంగాల నాగ‌బాబు ద‌ర్శ‌క‌త్వంలో ఎల్‌.నాని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో చిత్ర ద‌ర్శ‌కుడు జంగాల నాగ‌బాబు సినిమా విశేషాల‌ను తెలియ‌జేశారు.. అక్టోబ‌ర్ 28 నుండి సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తాం. రెండు సాంగ్స్‌ను ఫారిన్ లోకేష‌న్స్‌లో చిత్రీక‌రిస్తాం. అక్ష హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు క‌మ‌ల్ మ్యూజిక్, వాసిరెడ్డి స‌త్యానంద్ సినిమాటోగ్రఫీ పెద్ద ఎసెట్ కానుంది. అల్ల‌రోడు సినిమా త‌ర్వాత నేను చేస్తున్న సినిమా క‌త్తిలాంటి కుర్రాడు. నాకు హీరోగా అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్ అని హీరో విసుశ్రీ అన్నారు. మంచి సినిమాలో భాగ‌మ‌వుతున్నందుకు ఆనందంగా ఉంద‌ని హీరోయిన్ అక్ష తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మ‌రో హీరోయిన్ హ‌మీదా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ క‌మ‌ల్‌, న‌టుడు శ‌శిరాజేంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు. 
ర‌ఘుబాబు, కృష్ణ‌భ‌గ‌వాన్‌, భ‌ర‌త్ రెడ్డి, శ‌శిరాజేంద్ర‌, హేమ‌, సురేఖా వాణి త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్ః బి.ముత్యాల రాము,  కో డైరెక్ట‌ర్ః శివాజీ గ్రంథం, ప్రొడ్యూస‌ర్ ప‌ర్స‌న‌ల్ మేనేజ‌ర్ః ప్ర‌శాంత్‌, ఆఫీస్ మేనేజ‌ర్ః వెంక‌ట్‌, ఆర్ట్ః బాబ్జి, స్టంట్స్ః క‌న‌ల్ క‌న్న‌న్‌, కెమెరాః వాసిరెడ్డి స‌త్యానంద్‌, సంగీతంః క‌మ‌ల్‌, పాట‌లుః రామ‌జోగ‌య్య‌శాస్త్రి, అనంత్ శ్రీరాం, మాట‌లుః ఎమ్‌.ఎమ్‌.వెంక‌ట్‌, క‌థః జి.వి.శ్రీనివాస్‌, స‌హ నిర్మాత‌లుః డి.ర‌వికుమార్‌, సి.హెచ్‌.నాగేశ్వ‌ర‌రావు,
నిర్మాతః ఎల్‌.నాని, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః జంగాల నాగ‌బాబు.

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading