మిసిమి మూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నం : 1 ప్రారంభం

మాగంటి శ్రీనాథ్, పల్లవి నటీనటులుగా మిసిమి మూవీ క్రియేషన్స్  పతాకంపై ప్రొడక్షన్ నం : 1 చిత్రం ఇటీవల కందవాడలో ప్రారంభమైంది. ఆర్.వై .జె శ్రీరాజా ఈ చిత్రానికి దర్శకుడు. జి రమేష్ నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ… రొమాంటిక్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్న చిత్రమిది అని తెలిపారు. 
నిర్మాత మాట్లాడుతూ… సత్యానంద్ దగ్గర శిక్షణ పొందిన శ్రీనాథ్ ని హీరోగా పరిచయం చేస్తున్నాం. మొదటి షెడ్యూల్ పూర్తయింది. టాకీ, పాటలు డిసెంబర్, జనవరి లో చిత్రీకరిస్తాం అని అన్నారు. 
ఈ చిత్రానికి కెమెరా: శ్యాం దూపాటి, ఎడిటింగ్: వేణు, సంగీతం: ఘనశ్యాం, పాటలు, రచన సహకారం : జి. రమేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: బెక్కం రవీందర్, కో డైరెక్టర్: సాయి త్రివేది, రచన, దర్శకత్వం: ఆర్.వై .జె శ్రీరాజా నిర్మాత: జి రమేష్. 

Stills

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …