ముళ్ళపూడి మూవీ మేకర్స్ బ్యానర్ పై ముళ్ళపూడి చక్రవర్తి నిర్మాతగా, శ్రీ నాగ వెంకట సత్యనారాయణ క్రియేషన్స్ పై మేడసాని రమేష్ సమర్పణలో ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ మూడోవారం నుంచి ప్రారంభం కానుంది. బెంగుళూరు, ఉడిపి, మంగుళూరు, కేరళ, ఢిల్లీ, కులుమనాలిలో 45 రోజులు షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో తేజ్, విష్ణు తేజ, విక్టరీ ఉదయ్, ముళ్ళపూడి చక్రవర్తి, ధీరుమహేష్, వెంకీ మంకీస్, మేడసాని రంగబాబు, సుమన్ శెట్టి, గగన్ విహారి, కళ్ళు కృష్ణా రావు, రజనీకాంత్, మధుమిత, మమతా రాహుల్, సీతల్ కాలే, పూనమ్ దూబే, శ్రీవి, మధుమని, సుజాత దీవి లతో పాటు మరికొందరు సీనియర్ నటి నటులు నటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం శంకు సాయి శ్రీరామ్, నరేష్, సినిమాటోగ్రఫీ : తోట మహీధర్, కన్నడంలో ఒక చిత్రానికి దర్శకత్వం వహించి, పలు తెలుగు చిత్రాలకు మాటల రచయితగా పని చేసిన గోపికిరణ్ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించనున్నారు. గోపికిరణ్ గతంలో ‘అలె’ అనే ఒక కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో రైటర్ గా కాళిదాస్, ప్లస్ వన్, నెంబర్ వన్ స్టూడెంట్, దాగుడు మూతలు దండాకోర్ అనే చిత్రాలకి పని చేసారు. ప్రస్తుతం మీనా బజార్ అనే చిత్రానికి రైటర్ గా పని చేస్తున్నారు.
Tags mullapudi banner
Check Also
మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్లో నిర్మాత టి. రామకృష్ణ …