ప్రాజ్ఞేయ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై స్రవంతి సమర్పణలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `నీ దేవుడే నా దేవుడు`. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా….
అలాగే నాకెంతోఇష్టమైన హీరోయిన్ దివ్యవాణి ఈ చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తుండటం విశేషం. బైబిల్ సంబంధిత సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. తొలి కిరణం దర్శకుడు జాన్‌బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బైబిల్‌లోని అత్తాకోడళ్లుకు సంబంధించిన కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మంచి మెసేజ్ ఉన్న చిత్రం. మంచి టీం కుదిరింది. సినిమా మంచి సక్సెస్‌ను సాధించాలని కోరుకుంటున్నానని బాబూ మోహన్ తెలిపారు.
తొలి కిరణం తర్వాత నా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తవుతుంది. ఇది హిస్టారికల్ చిత్రం. క్రీస్తుపూర్వం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన అత్తాకోడళ్లు కథ. దాదాపు పది కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మాత తెరకెక్కిస్తున్నారు. తొలి షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో ఈ నెల 26 వరకు జరుగుతుంది. రెండో షెడ్యూల్ టర్కీలో చిత్రీకరిస్తాం.జూన్‌లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. దివ్యవాణిగారు మా సినిమా నటించడానికి ఒప్పుకోవడం ఆనందంగా ఉంది. ఆర్.పి.పట్నాయక్‌గారు మంచి సంగీతాన్ని అందించారని దర్శకుడు జాన్ బాబు తెలియజేశారు. పదిహేనేళ్ల వయసు నుండి సినిమాల్లో నటిస్తున్నాను. పెళ్లైన తర్వాత ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నాను. నాకు ఇష్టమైన ఈ ఫీల్డ్‌కు దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. బైబిల్‌లోని ఓ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఓ కుంటుంబంలోని ప్రేమానురాగాలను ఆధారంగా చేసుకుని సినిమా ఉంటుంది. నయోని అనే పాత్రలో కనపడతాను. మా టీంకు ఆ ప్రభువు, ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటుందని భావిస్తున్నానని దివ్యవాణి చెప్పారు. మంచి మెసేజ్‌తో, భారీ బడ్జెట్‌తో చేస్తున్న సినిమా. ముందుగానే రిలీజ్‌డేట్‌ను ప్లాన్ చేసుకుని దానికనుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నామని నిర్మాత డి.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. తొలి కిరణం తర్వాత జాన్‌బాబుగారి దర్శకత్వంలో మరో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో ఆరు పాటలుంటాయి. మంచి మ్యూజిక్ కుదిరిందని ఆర్.పి.పట్నాయక్ అన్నారు.
ఈ చిత్రానికి కథః జి.విజయ, రచన, మాటలుః వి.ఎమ్.ఎమ్.ప్రవీణ్, సంగీతంః ఆర్.పి.పట్నాయక్, ఎడిటర్ః టి.రాజు, సినిమాటోగ్రఫీః ఆర్.పి.పట్నాయక్, ఆర్ట్ః నాగు, నిర్మాతః డి.శ్రీధర్ రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః జాన్‌బాబు.