రెబ‌ల్‌స్టార్ కృష్ణం రాజుగారు క్లాప్ ఇవ్వ‌గా ప్రారంభ‌మైన‌ యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌, యు.వి.క్రియోష‌న్స్‌, సుజిత్ చిత్రం

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ , సుజిత్ (ర‌న్ రాజా ర‌న్ ఫేం) కాంబినేష‌న్ లో, వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న యు.వి.క్రియోష‌న్స్ ప‌తాకం పై వంశి, ప్ర‌మోద్ లు నిర్మాత‌లుగా తెర‌కెక్కుతున్న చిత్రం ఈరోజు (13 ఫిబ్ర‌వ‌రి) న యు.వి .క్రియోష‌న్స్ ఆఫీస్ లో నిరాడంబ‌రంగా పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. ఈ కార్క‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు గారు  హ‌జ‌రయ్యారు. ఇంకా ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌,  లు హ‌జ‌ర‌య్యారు. 
రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు గారు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ పై క్లాప్ ఇవ్వ‌గా, దిల్ రాజు గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు కొరియోగ్రాఫ‌ర్ రాజుసుంద‌రం, సంగీత ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఎషాన్ లాయ్ , సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ది, ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా సాబు సిరిల్ లు . ఈ చిత్రం తెలుగు, త‌మిళం, హింది భాష‌ల్లో నిర్మిస్తున్నారు. షూటింగ్ మ‌రియు ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు.. ఈ చిత్రం యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 19 వ చిత్రం గా “భాహుబ‌లి – క‌న్‌క్లూజ‌న్ ” త‌రువాత  చిత్రం గా విడుద‌ల అవుతుంది.

Stills

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …