జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న `ప్రేమంత పనిచేసే నారాయణ` సినిమా ప్రారంభోత్సవం బుధవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ముఖ్యతిధిగా విచ్చేసిన హీరో శ్రీకాంత్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, సీనియర్ నిర్మాత బి.గోపాల్ కెమెరా స్విచ్చాన్చేయగా, సీనియర్ దర్శకులు బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో హరికృష్ణ, అక్షిత హీరో, హీరోయిన్లగా పరిచయం అవుతున్నారు.
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిత్ర దర్శక, నిర్మాత జొన్నల గడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ “ ఇప్పటివరకూ టాలీవుడ్ లో చాలా మంది సీనియర్ హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించాను. తొలిసారి నూతన నటీనటులు ఈ చిత్రం చేస్తున్నారు. ఇతర టెక్నిషియన్నలు కూడా అంతా కొత్తవారే. అరకులో ఓ కుర్రాడికి జరిగిన రియల్ ఇన్సిండెట్ ను బేస్ చేసుకుని కథను సిద్ధం చేశా. ఇదొక కాంపెక్ట్ సబ్జెక్ట్. అండర్ కరెంట్ గా లవ్, కామెడీ అంశాలు నడుస్తుంటాయి. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో ఆసక్తికరంగా సాగుతుంది. ఈనెల 25 నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్తాం. ఎక్కువ భాగం చిత్రీకరణ హైదరాబాద్ లో ఉంటుంది. ఒక పాటను అరకులో షూట్ చేస్తాం. సింగిల్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తిచేసి మార్చికల్లా విడుదల చేస్తాం. కొత్త వాళ్లతో తెరకెక్కిస్తున్న ఓ పెద్ద సినిమాలో ఉంటుంది. మా ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులంతా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా` అన్నారు.
చిత్ర హీరో హరికృష్ణ మాట్లాడుతూ “ హీరోగా తొలి సినిమా ఇది. డిఫరెంట్ లవ్ స్టోరీ. మంచి టీమ్ కుదిరింది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది` అని అన్నారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ “ ఇప్పటివరకూ నేను సంగీతం అందిచిన సినిమాలన్నింకంటే కొత్తగా ఉండే ట్యూన్స్ అందించాను. పాటలు, నేపథ్య సంగీతం అన్నీ వైవిథ్యంగా ఉంటాయి. అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు` అని అన్నారు.
సినిమాలో అవకాశం పట్ట హీరోయిన్ అక్షిత ఆనందం వ్యక్తం చేసింది. ` రాజా వన్నెం రెడ్డి, శ్రీరాం బాలాజీ, జబర్దస్త్` దుర్గారావు, రాజేంద్రకుమార్, చరణ్, గిరి, సూర్యనారాయణ, రాజారావు తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సహ నిర్మాత సావిత్రి.జొన్నలగడ్డ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.బి.ఎన్. రాజు, కథ, మాటలు: లక్ష్మి.వి.శివ, కెమెరా: కృష్ణ జక్కుల, సంగీతం: యాజమాన్య, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, ఫైట్స్: రామ్ సుంకర, కథనం, దర్శకత్వం, నిర్మాత: జొన్నలగడ్డ శ్రీనివాసరావు.