దీపావ‌ళి సంద‌ర్భంగా గోపీచంద్‌-బి.గోపాల్ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

చిరంజీవి, బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు వంటి స్టార్స్‌తో  స‌క్సెస్ ఫుల్  మాస్ మూవీస్ అందించిన మాస్ డైరెక్ట‌ర్ బి.గోపాల్ ఇప్పుడు గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నారు. గోపీచంద్ – బి.గోపాల్ కాంబినేష‌న్ రూపొందే యాక్ష‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ను జ‌య బాలాజీ రియ‌ల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో గోపీచంద్ సర‌స‌న అందాల తార న‌య‌న‌తార న‌టిస్తుంది. ఈ భారీ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ మూవీ టైటిల్ & ఫ‌స్ట్ లుక్ ను దీపావ‌ళికి రిలీజ్ చేయ‌నున్నారు.
ఈ సంద‌ర్భంగా నిర్మాత తాండ్ర ర‌మేష్ మాట్లాడుతూ…గోపీచంద్, న‌య‌న‌తార‌, బి.గోపాల్ కాంబినేష‌న్లో ఈ మూవీ నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీపావ‌ళికి టైటిల్ & ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియోను న‌వంబ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఇక చిత్రాన్ని డిసెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నాం. క్లైమాక్స్ మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ఈ చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ పెట్టాలనే ఆలోచ‌న‌లో ఉన్నాం. ఈ చిత్రంలో కోట శ్రీనివాస‌రావు, ప్ర‌కాస్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్ర‌క‌థ‌ను వ‌క్కంతం వంశీ అందించ‌గా సంభాష‌ణ‌ల‌ను అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. టాప్ ఆర్టిస్టులు & టెక్నీషియ‌న్స్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకునేలా ఉంటుంది అన్నారు.
 గోపీచంద్, న‌య‌న‌తార‌, ప్ర‌కాష్ రాజ్, బ్ర‌హ్మానందం, కోట శ్రీనివాస‌రావు, అభిమ‌న్యు సింగ్, చ‌ల‌ప‌తిరావు, ఉత్తేజ్, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, ర‌మాప్ర‌భ‌, సురేఖ‌వాణి, స‌న‌, సంధ్య‌జ‌న‌క్, మ‌ధునంద‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మ్యూజిక్ – మ‌ణిశ‌ర్మ‌, స్టోరీ – వ‌క్కంతం వంశీ, డైలాగ్స్ – అబ్బూరి ర‌వి, ఫైట్స్ – క‌ణ్ణ‌ల్ క‌న్న‌న్, సినిమాటోగ్ర‌ఫీ – బాల మురుగన్, ఎడిటింగ్ – కోట‌గిరి వెంటేశ్వ‌ర‌రావు, ఆర్ట్ – నారాయ‌ణరెడ్డి, నిర్మాత – తాండ్ర ర‌మేష్, డైరెక్ట‌ర్ – 

About CineChitram

Check Also

మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా `ల‌క్ష్మీబాంబ్`

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading