ప్రతి సమస్యకి యుధ్ధం సమాధానం కాదు. యుధ్ధం లేని ప్రపంచాన్ని చూడాలనుకునే ఓ మేజర్ కథే ఈ 1971 భారత సరిహద్దు చిత్రం. 1971 వ సంవత్సరంలో పాకిస్తాన్‌కి, భారతదేశానికి మద్య జరిగిన యుధ్ధ నేపద్యంలో ఈ కథాంశం నడుస్తుంది. అంతేకాదు ఆ యుధ్ధం జరిగిన ప్రదేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించటం జరిగింది. రియల్ గా యుధ్ధ ట్యాంకర్స్ ని వాడి షూట్ చేశారు. బోర్డర్ లోని ప్రతి సైనికుడు తమ కర్తవ్యాన్ని దైవంలా భావించి వారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా దేశరక్షణ కోసం ఎలా పని చేస్తారనేది ఈ చిత్రంలోని ముఖ్య కథాంశం. ఈ చిత్రాన్నిమలయాళంలో మంచి చిత్రాల దర్శకుడు, నటుడు అంతకు మించి మాజి భారత సైనికాధికారి మేజర్ రవి దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్‌స్టార్ మెహన్‌లాల్ హీరోగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో అల్లు శిరీష్ నటించారు. ఈ చిత్రం మొదటి లుక్ ని అతి త్వరలో విడుదల చేయనున్నారు. భారతదేశంలో అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రతి భారతీయుడు చూడవలసిన తెలుసుకోవలసిన చిత్రం ఈ 1971 భారత సరిహద్దు.. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ శ్రీనివాస ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై, పూజా కాత్యాయని నిర్మిస్తున్నారు.
మాటలు- ఎం.రాజశేఖర్ రెడ్డి, ఫోటొగ్రఫి- సుజిత్ వాసుదేవ్, ఎడిటర్-సమ్జిత్, ఆర్ట్- పలు.కె.జార్జ్ , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్- గొపి సుందర్, సంగీతం- సిద్దార్ధ విపిన్, నాజిమ్ అర్షద్, రాహుల్ సుబ్రమణ్యన్, నిర్మాత- పూజా కాత్యాయని, దర్శకత్వం- మేజర్ రవి