ర౦గ౦ 2 గా తెలుగులో వస్తున్న జీవా తమిల చిత్ర౦ “యాన్ “

తెలుగులో సంచలన విజయాలు సాధించిన అనువాద చిత్రాల్లో ‘రంగం’ ఒకటి. సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడు జీవాకు తెలుగులో తిరుగులేని ఫాలోయింగ్‌ తెచ్చిన చిత్రమిది. ఈ చిత్రాన్ని మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు తెస్తూ..  జీవా నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన ‘యాన్‌’ అనే చిత్రం ‘రంగం`2’ పేరుతో ముస్తాబవుతోంది.

‘రంగం’ చిత్రానికి సంగీత సారధ్యం వహించిన హ్యారిస్‌ జైరాజ్‌ ‘రంగం`2’ చిత్రానికి కూడా మ్యూజిక్‌ చేశారు. ‘రంగం’లో జీవా సరసన మొన్నటి మేటి కథానాయకి రాధ కుమార్తె కార్తీక నాయర్‌ హీరోయిన్‌గా నటించగా.. ‘రంగం`2’లో జీవాకు జంటగా రాధ రెండో కుమార్తె` కార్తీక చెల్లెలు తులసీ నాయర్‌ నటించడం విశేషం.

జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌.బాలాజి (సూపర్‌గుడ్‌ బాలాజి) నిర్మిస్తున్న ‘రంగం`2’ ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా.. సూపర్‌గుడ్‌ బాలాజీగా పరిశ్రమ వర్గాలకు సుపరిచితులైన నిర్మాత ఎ.ఎన్‌.బాలాజి మాట్లాడుతూ.. ‘సూపర్‌గుడ్‌ చౌదరిగారి ఆశీస్సులతో జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘రంగం`2’తో మా హీరో జీవాకు తెలుగులో గల ఫాలోయింగ్‌ మరింత పెరుగుతుంది. ‘రంగం’ చిత్రంతో ప్రముఖ సినిమాటోగ్రఫర్‌ కె.వి.ఆనంద్‌ దర్శకుడిగా పరిచయం కాగా- ‘రంగం`2’తో మరో సుప్రసిద్ధ సినిమాటోగ్రఫర్‌ రవి.కె.చంద్రన్‌ దర్శకుడిగా పరిచయమవుతుండడం విశేషం. ‘రంగం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో.. ‘రంగం`2’ కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. జీవా పర్‌ఫార్మెన్స్‌- తులసీనాయర్‌ గ్లామర్‌, హారీస్‌ జైరాజ్‌ మ్యూజిక్‌, రవి.కె.చంద్రన్‌ స్క్రీన్‌ప్లే- దర్శకత్వం ‘రంగం-2’ చిత్రానికి ముఖ్య ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. అతి త్వరలో ఆడియో విడుదల చేసి, నవంబర్‌ ద్వితీయార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

నాజర్‌, జయప్రకాష్‌, ఊర్మిళ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, కెమెరా: మానుష్‌ నందన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: హ్యారిస్‌ జైరాజ్‌, సమర్పణ: జస్‌రాజ్‌ ప్రొడక్షన్స్‌, నిర్మాత: ఎ.ఎన్‌.బాలాజి (సూపర్‌గుడ్‌ బాలాజి), కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రవి.కె.చంద్రన్‌!!

Trailer

Gallery

About CineChitram

Check Also

`గ‌జేంద్రుడు` ఆర్య కెరీర్‌లోనే టర్నింగ్ పాయింట్ మూవీ అవుతుంది – ఆర్‌.బి.చౌద‌రి

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading