‘ద్యావుడా’ డైరెక్టర్‌ పత్రికాముఖ క్షమాపణ

నూతన సంవత్సరంలో మొదటి రోజున విడుదలైన ‘ద్యావుడా’ చిత్ర టీజర్‌ సృష్టించిన అలజడి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ‘సాయిరాం దాసరి’ మాట్లాడుతూ హిందువుల మనో భావాలను దెబ్బతీయాలనేది నా ఉద్ధేశ్యం కాదు. నేనూ హిందువునే. కానీ ఇంతమంది నా సినిమా ‘టీజర్‌’ చూసి స్పందిస్తుంటే దానికి బాధ్యత వహిస్తూ ముందుగా హిందూ సోదరులందరికీ క్షమాపణ తెలుపుతున్నాను. కాకపోతే కర్నాటకలోని ఉజ్జయిని దేవాలయంలో సిగిరెట్లతో, మందు బాటిళ్లతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉంది. మేము ఆ ఆచారాన్ని ఇన్ప్రిరేషన్‌గా తీసుకుని ఈ సినిమాలో చివరికి శివ మహాత్యాన్ని చేసే ప్రయత్నం చేశాం. కానీ సినిమా విడుదలకు ముందే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి..ఆ దృశ్యాలను మా సినిమా నుండి తొలగిస్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి తెలుగు భక్తులకు నేను క్షమాపణ తెలుపుతున్నాను.
ఇట్లు, 
సాయిరాం దాసరి 
(ద్యావుడా చిత్ర దర్శకులు)

About CineChitram

Check Also

మహిళా దినోత్సవం సందర్భంగా మహానటి పోస్టర్ విడుదల!!

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading