నాల్గోవ షెడ్యూల్ లో బిజీగా ఉన్న “ఏంజెల్”

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సోషియోఫాంటసీ ఎంటర్ టైనర్ ఏంజెల్. గతేడాది షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే మూడు షెడ్యూల్స్ దిగ్విజయంగా పూర్తిచేసుకొని తాజాగా జనవరి 16 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాల్గోవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ టాలెండ్ హీరో నాగఅన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దర్శకధరీడు రాజమౌళి అసోసియేట్ బాహుబలి పళని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న షెడ్యూల్ ని జనవరి నెలాఖరు వరకు నిర్విహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాత భువన్ సాగర్ తెలిపారు. ఈ సినిమాలోసప్తగిరి, ప్రదీప్ రావత్, షియాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెస్సరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ముప్పా వెంగయ్య చౌదరిసమర్పణలో సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రచన : శ్రీనివాస్ లంకపల్లి, ఆర్ట్‌: వి.ఎస్. సాయిమణి,స్టంట్స్‌: రామ్ లక్ష్మణ్, డైలాగ్స్‌: వేంపల్లి రమేశ్ రెడ్డి, ఎడిటర్‌: చోట.కె.ప్రసాద్, సినిమాటోగ్రఫీ: గుణ

About CineChitram

Check Also

ఫణి ఫిలిం ఫ్యాక్టరీ “స్ట్రేంజర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి !!

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading