అల్లాణి శ్రీధర్ స్వీయదర్శకత్వంలో ఈటివి సౌజన్యంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన చిలుకూరి బాలీజీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ కారు సినిమాకు యు సర్టిఫికెట్ ఇచ్చారు.
చిలుకూరి బాలాజీ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు అధికారులు సినిమా చాలా హృద్యంగా మనసును తోనే విధంగా ఉందని ప్రశించారు. ఈ తరం యువతరానికి వీసాలు బాలాజీ గా తన ఆశీర్వాదాలు అందిస్తూ తర తరాలుగా అందరిచే ఆరాధింప బడుతున్న చిలుకూరి బాలాజీ ప్రశస్తతను. ఆ ఆలయ స్థల పురాణాన్ని ఒక దృశ్య కావ్యంగా చిత్రీకరించారు. ఇది ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన అవసరం ఉంది అన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ సెన్సార్ అధికారుల ప్రశంసల తో మాకు చాలా ధైర్యం వచ్చింది. ఒక మంచి సదుద్దేశ్యంతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం మాకుంది. ఈ సినిమాను జిల్లాల వారిగా ప్రదర్శన హక్కులను అడుగుతున్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చినజీయర్ స్వామి విడుదల చేసిన ఈ చిత్రం ఆడియోను సోషల్ మీడియా ద్వారా తదితర మాధ్యమాల ద్వారా లక్షలాది మంది ఈ సంగీతాన్ని వింటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన భక్తి సినిమా పాటల్లో ఇవే గొప్ప గా విన పడుతున్న పాటలు అని పలువురు ప్రశింస్తున్నారు. ఈ సినిమాకు అర్జున్ మంచి సంగీతాన్ని అందించాడు. సుద్దాల అశోక్ తేజ, జొన్న విత్తుల, కాపర్తి వీరేంద్ర, రాణిపులోమజా దేవి లు భక్తి రసం జాలువారే విధంగా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. పాటలు విన్న వారంతా ఒక భక్తి తన్మయత్వంలోకి వెళ్ళవలసిందే అని అంటున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబర్ రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అన్నారు
సాయికుమార్, సుమన్, యస్.పి బాలసుబ్రహ్మణ్యం, భానుశ్రీమెహ్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః అర్జున్, రచన, నిర్మాణం, దర్శకత్వంః అల్లాణి శ్రీధర్.