Janatha Garage Movie Review

Note: Spoilers Ahead

గమనిక : కథ గురి౦చి కొ౦చె౦ చర్చ ఉ౦టు౦ది 
Cast: NTR, Mohanlal, Samantha, Nithya Menen
Music: Devi Sri Prasad
Written and directed by: Koratala Siva

జనతా గారేజ్

సినిమా పేరు చూడగానే ఇది మ౦చి మాస్ సినిమా , డైరెక్టర్ ఏమో కొరటాల , సి౦పిల్ ఎలివేశన్స్ తో ఆడియన్స్ ని ఎ౦టర్ టెయిన్ చేస్తాడు అనుకుని పొద్దు పొద్దున్నే చూడటానికి వెళ్ళాను.. మరి ఫైనల్ గా కొరటాల జూనియర్ యన్ టి ఆర్ తో కలిసి ఏ౦ చేసాడో చూడాలని ఉ౦దా ?
మరి౦కె౦దుకు ఆలస్య౦ ……చదివెయ్య౦డి….

కధలోకి వెళ్తే 

జనతా గారేజ్ …. ఒక కుట్౦బ౦ కోస౦ ఇ౦కో కుటు౦బ౦ సహాయపడుద్ది అనే చిన్న కాన్సెప్ట్ ని విజువలైజ్ చేసుకుని తీసిన సినిమా .. టైటిల్స్ పడగానే అసలు జనతా గారేజ్ ఎందుకు మొదలయింది , ఎలా మొదలయింది అనేదాన్ని ఒక అరగంట చూపిస్తారు. ఈ జనతా గారేజ్ వల్ల అన్యాయం అయిపోకూడదని హీరోని ఈ గారేజ్ కి దూరంగా పెంచుతారు వాళ్ళ మామయ్యలు. అలా సినిమా అరగంట గడిచాక హీరో ఎంట్రీ ఉంతుంది. అక్కడ మొదటి పాట … చూడటానికి బాగుంది. అలా హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చెస్తూ , బిల్డ్ చేస్తూ … హీరో అసలు స్వరూపాన్ని ప్రేక్షకులకి చూపే ప్రయత్న0 చేసాడు దర్శకుడు. ఆ విషయం లో దర్షకుడు సక్సెస్ అయ్యడు అనుకోవచ్చు. కానీ ఈ ప్రయత్నం లో హీరో చేత చెప్పించే భారీ డైలాగులు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉంటాయి తప్ప వినోదాన్ని పంచేలా ఉండవు.

అలా కథ సాగుతూ ఉండగా అనుకోని సంఘటణ వల్ల హైదరాబాదు వస్తాడు మన హీరో. అక్కడ ఒక సంఘటణ తో మోహన్లాల్ తో పరిచయం అవుతుంది . ఇక్కడ ఇంటర్వెల్ సీన్ ఫర్స్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గది.

రెండో భాగం లో అనుకోని సంఘటన వల్ల మోహన్ లాల్ గాంగ్ లో చేరుతాడు మన హీరో . చేరాక చివరకు ఏ0 జరిగింది అనేది మిగతా సినిమా.

సాంకేతికం :
సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. చాయాగ్రహణం బాగుంది. ఈ రెండు కలిస్తే పాటాలు చూడడానికి బాగుంటాయని మరు చెప్పనవసరం లేదు. కాజల్ అగర్వాల్ పాట సినిమాకి ప్రధాన ఆకర్షణ.

కళాకారుల పని తీరు:
జూనియర్ యన్ టీ ఆర్ , సమంతా , నిత్యా మీనన్ , మోహన్ లాల్ ఎవరికి వారు తమదైన శైలిలో చేసారు.
చివరగా:
సింప్లుల్ ఎలివేషన్స్ కి పేరున్న కొరటాలగారు ..ఈ సినిమాని ఫ్లాట్ గా తీసారు అంటే చలా సాధారణంగా తీసారనమాట . సాధారణ కధని తనదైన శైలి లో తీసే ప్రయత్నం లో కొరటాల గారు తడబడ్డారు.

ఓవరాల్ గా చెప్పాలి అంటే అరకొర సన్నివేషాలు తప్ప … గారేజె లో సామాన్లు మిస్ అయ్యాయని చెప్పొచ్చు .

CC Rating

5 - 2.5

2.5

Out of 5

User Rating: 2.65 ( 1 votes)

About CineChitram

Check Also

ఎక్కడికి పోతావు చిన్నవాడా – సినిమా సమీక్ష

తారాగణ౦: నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading