గ్యాంగ్‌స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా`ఖయ్యుం భాయ్`. ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సాయి ఊహ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి కట్టా శారద చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 5 వతేదీకి షూటింగ్ పూర్తిచేసి గుమ్మడికాయ కొట్టడానికి రెడీ అవుతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు భరత్ తాజా ప్రొగ్రస్ ను వివరిస్తూ “హైదరాబాద్, అమరావతి, మంగళగిరి తదితర చోట్ల తొలి, మలి షెడ్యూల్స్ పూర్తి చేశాం. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లో సాగుతోంది. మూడు పాటలు షూటింగ్ కూడా పూర్తయింది. రేపటి నుంచి ( గురువారం) నుంచి నాల్గవ పాట షూట్ ప్రారంభిస్తాం. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అద్భుతమైన ట్యూన్స్ అందించారు. ఇప్పటివరకూ షూట్ చేసిన పాటలన్నీ బాగా వచ్చాయి. సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అవుట్‌పుట్ బాగా వచ్చింది. తారకరత్న పెర్పామెన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. నేను అడిగందాల్లా సమయానికి ఏర్పాటు చేసి బాగా సహకరించారు. 50,60 కోట్ల బడ్జెట్ సినిమాలా కనిపిస్తుంది. గతంలో నేను చేసిన సినిమాలన్నింకంటే రిచ్ గా సినిమా వచ్చింది. ఫిబ్రవరి 5 తర్వాత ఆడియో, నెలాఖరున లేదా మార్చి లో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం` అని అన్నారు.
నయీమ్ పాత్రధారి కట్టా రాంబాబు మాట్లాడుతూ -“భరత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఆయనతో 25 ఏళ్ల స్నేహ బంధం నాది. మద్రాసులో ఉన్నప్పటి నుంచి సుపరిచితం. ఈ సినిమాలో నటించే చిన్నా, బెనర్జీ తదితరులంతా స్నేహితులే. నందమూరి ఫ్యామిలీతోనూ చక్కని అనుబంధం ఉంది. తారకరత్న ఓ పవర్‌ఫుల్ ఏసీపీగా నటిస్తున్నారు. నయీమ్ చిన్నప్పటినుంచి ఎన్‌కౌంటర్‌లో మరణించిన వరకూ జరిగిన అన్ని సంఘటనల్ని తెరపై చూపిస్తున్నాం. అలాగే సినిమాలో ఐదు పాటలున్నాయి. శేఖర్ మాష్టర్ కొరియోగ్రఫీ, గౌతంరాజు గారు ఎడిటింగ్ చేస్తున్నారు. గోపి మోహన్ – కోన వెంకట్ పర్యవేక్షణలో భవానీ ప్రసాద్ మాటలు అందించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది“ అని తెలిపారు
మౌని (బెంగళూరు), ప్రియ , హర్షిత ,రాగిని , సుమన్, చిన్నా, చలపతిరావు, బెనర్జీ, యల్.బి. శ్రీరాం, జీవ, బాహుబలి ప్రభాకర్, వినోద్, రాంజగన్ ,ఫిష్ వెంకట్ , కోటేశ్వరరావు , జూనియర్ రేలంగి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. కెమెరా: శ్రీధర్ నార్ల, ఎడిటింగ్: గౌతంరాజు, కళ: పి.వి.రాజు, సంగీతం: శేఖర్ చంద్ర, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: శేఖర్, మాటలు: భవానీ ప్రసాద్, కథ-కథనం-దర్శకత్వం: భరత్