“రాఘవేంద్రరావు” గారు చేతులు మీదుగా “రాజా.. మీరు కేక” సాంగ్ లాంచ్

RK Studios “గుంటూరు టాకీస్” సినిమా తర్వాత  నిర్మించిన రెండవ చిత్రం “ రాజా మీరు కేక “  “సంద్రమే స్నేహమై”  సాంగ్  లాంచ్  ఈరోజు ప్రముక దర్శకులు “రాఘవేంద్రరావు” గారి చేతులు మీదుగా జరిగినది. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ, దర్శకుడిగా తన మొదటి సినిమా విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ, దర్శకులు కృష్ణ కిశోర్ గారికి, నిర్మాత రాజ్ కుమార్ గారికి మరియు ఈ సినిమాలో  నటించిన నటీనటులకు అబినందనలు తెలియచేసారు.  

చిత్ర నిర్మాత రాజ్ కుమార్ గారు మాట్లాడుతూ తమ మొదటి సినిమా గుంటూరు టాకీస్ విజయం తర్వాత నిర్మించిన  “రాజా మీరు కేక” సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుందని మరియు  తమ సంస్థకు మరొక అద్భుత విజయాన్ని అందిస్తుందని ఆసిస్తూ ఈ సినిమాలో నటించిన నటినటులు రేవంత్, నోయెల్, హేమంత్, లాస్య శోభిత లకు మరియు ముఖ్య పాత్రలో నటించిన  నందమూరి తారకరత్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, తమ సినిమా ఫ్రెండ్షిప్ సాంగ్ ని లాంచ్ చేసిన దర్శకులు “రాఘవేంద్రరావు” గారికి దన్యవాదాలు తెలిపారు.

చిత్ర దర్శకుడు కృష్ణ కిశోర్ గారు మాట్లాడుతూ తన మొదటి సినిమా సాంగ్ లాంచ్ చేయడం ఎంతో సంతోషం కలిగించిందని చెబుతూ రాఘవేంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన నటినటులకు, సాంకేతిక నిపుణులకు దన్యవాదాలు తెలిపారు.

ఈ సినిమాలో నటించిన నటినటులు రేవంత్, నోయెల్, లాస్య మాట్లాడుతూ మంచి సినిమాను ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారని, ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, తమకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కుమార్ గారికి, దర్శకులు కృష్ణ కిశోర్ గారికి మరియు సాంగ్  లాంచ్ చేసిన రాఘవేంద్రరావు గారికి దన్యవాదాలు తెలిపారు. ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్.M, DOP : రామ్ P రెడ్డి, సంగీతం: శ్రీచరన్, ఆర్ట్: మారేష్ శివన్, stunts: జాషువ, ఎడిటర్: SB ఉద్ధవ్

 

Stills

About CineChitram

Check Also

అవ‌స‌రాల శ్రీను, అభిషెక్ పిక్చ‌ర్స్ “బాబు బాగా బిజి” ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న‌

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading