తంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `రోజ్ గార్డెన్`. ప్రస్తుతం ఈ చిత్రంతో కాశ్మీర్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ద వాతావరణం కలిగి ఉంది. కాశ్మీర్‌లో అడుగుపెట్టడానికే భయం నెలకొన్న సమయంలో ధైర్యంగా, సాహసంగా ఈ చిత్రం పూర్తిగా కాశ్మీర్‌లోనే చిత్రీకరణ జరుపుకోవటం విశేషం.
ఈ చిత్రం గురించి దర్శకుడు జి.రవికుమార్(బాంబే రవి) మాట్లాడుతూ – “కాశ్మీర్ మొత్తం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుగారు మాత్రమే సాహసంతో ఈ చిత్రాన్ని కాశ్మీర్‌లో నిర్మిస్తుండటం విశేషం. అలాగే కాశ్మీర్ ప్రభుత్వంతో నిర్మాతలకు ఉన్న అనుబంధం కారణంతో దాదాపు 120 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్ ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వం అందిస్తున్న భారీ భద్రత మధ్య సహకారంతో ఏ టెన్షన్ లేకుండా చిత్రీకరణ జరుగుతుంది“అన్నారు.
చిత్ర సమర్పకులు చదలవాడ తిరుపతిరావు మాట్లాడుతూ “ కాశ్మీర్ లో 40 రోజలు నుండి షూటింగ్ చేస్తున్నాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నాం. లవ్ అండ్ మ్యూజికల్ మూవీ. ఓ ప్రేమ జంట టెర్రరిస్టుల కారణంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొందనే పాయింట్‌ను కొత్తగా ఉంటుంది. ఇలాంటి కథకు మంచి మ్యూజిక్ ఉండాలనే ఉద్దేశంతో ఆరు పాటల్ని ముంబాయిలో భారీ ఎత్తున రికార్డ్ చేశాం. ప్రముఖ గాయకులు ఉదిత్ నారాయణ్, జావేద్ అలీ, సాధనా సర్గమ్, ఫలక్ ముచ్చల్, స్వరూప్ ఖాన్ తదితరులతో పాటలను పాడించాం. ఈ సినిమాలో ముఖ్యమైన ప్రేమ గీతాన్ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం రాయడం విశేషం. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు. నాలుగు పాటలతో సహా సినిమా 80 శాతం చిత్రీకరణను కాశ్మీర్‌లో పూర్తవుతుంది. డిల్లీలో నవంబర్ 1నుండి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. మిగిలిన పోర్షన్ అంతా హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
నితిన్ నాష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో ముంబాయికి చెందిన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. పోసాని కృష్ణమురళి, ధనరాజ్, మహేష్ మంజ్రేకర్, తమిళనటుడు త్యాగరాజన్, గౌతంరాజు, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః కె.శంకర్, ఫైట్స్ః టినువర్మ, నందు, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వంః జి.రవికుమార్(బాంబే రవి).