ముంబాయిలో ఆఖ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో `రోజ్‌గార్డెన్‌

అనురాధ ఫిలింస్ డివిజన్ బ్యాన‌ర్‌పై చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు స‌మ‌ర్ప‌ణ‌లో చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు నిర్మిస్తున్న చిత్రం `రోజ్‌గార్డెన్‌`. ఈ చిత్రంలో కాశ్మీర్ ఏక‌ధాటిగా 40 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. టెర్ర‌రిస్టుల బ్యాక్‌డ్రాప్‌లో ఇద్ద‌రి ప్రేమికుల మ‌ధ్య జ‌రిగే ఈ ప్రేమ‌క‌థా చిత్రం ప్ర‌స్తుతం ముంబాయిలో ఆఖ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. టెర్ర‌రిస్టుల‌ను వెంటాడి ప‌ట్టుకునే దృశ్యాల్ని ముంబాయిలో జోగేశ్వ‌రిచ బాంద్రా, మాహిమ్‌, గేట్ వే ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తారు. మూడు రోజుల పాటు జ‌రిగే ఈ చిత్రీక‌ర‌ణ‌తో సినిమా షూటింగ్ పూర్త‌వుతుంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు జి.ర‌వికుమార్‌(బాంబే ర‌వి) తెలిపారు. త‌మ సంస్థ‌లో వ‌స్తున్న మ్యూజికల్ ల‌వ్‌స్టోరీ రోజ్‌గార్డెన్‌. ఈ సినిమాలో ఏడు పాట‌లుంటాయి. అందులో ఒక పాట‌ను ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం.ర‌త్నంగారు రాయ‌డం విశేషం. ద‌ర్శ‌కత్వంతో పాటు ఈ సినిమాకు జి.ర‌వికుమార్ సంగీత సార‌థ్యం కూడా వ‌హించారు. పాటలు, టేకింగ్ సినిమాకు పెద్ద హైటైల్‌గా నిలుస్తాయి. సినిమా చాలా బాగా వ‌స్తుంది అని చిత్ర స‌మ‌ర్ప‌కుడు చ‌ద‌ల‌వాడ తిరుప‌తిరావు తెలియ‌జేశారు.
నితిన్ నాష్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రంలో ముంబాయికి చెందిన ఫ‌ర్నాజ్ శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. పోసాని కృష్ణ‌ముర‌ళి, ధ‌న‌రాజ్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, త‌మిళ‌న‌టుడు త్యాగ‌రాజ‌న్‌, గౌతంరాజు, ర‌జిత, ముంబాయికి చెందిన మిలింద్ గునాజి, సునీల్ కుమార్‌, అశోక్‌కుమార్ బెనివాల్‌, గౌహ‌ర్‌ఖాన్‌తో పాటు ప్ర‌ముఖన‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత త్యాగ‌రాజ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః కె.శంక‌ర్‌, ఫైట్స్ః టినువ‌ర్మ‌, నందు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, సంగీతం, ద‌ర్శ‌క‌త్వంః జి.ర‌వికుమార్‌(బాంబే ర‌వి).

Stills

About CineChitram

Check Also

ఫణి ఫిలిం ఫ్యాక్టరీ “స్ట్రేంజర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి !!

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading