7 న వస్తున్న “శరణం గచ్ఛామి”

సెన్సార్ పరమైన ఇబ్బందులు ఎదుర్కొనడం ద్వారా ఇటీవలకాలంలో అత్యంత చర్చనీయాంశమైన “శరణం గచ్ఛామి” చిత్రం అన్ని అడ్డంకులు అధిగమించి.. ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమరాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల సందర్భంగా ప్రీ రిలీజ్ మరియు ప్లాటినం డిస్క్ ఫంక్షన్  ఏర్పాటు చేశారు. 
 
ప్రొడ్యూసర్ఈ కౌన్సిల్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన పరుచూరి వెంకటేశ్వరావు, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ్, చిత్ర దర్శకులు ప్రేమ రాజ్, నిర్మాత బొమ్మకు మురళి, హీరో నవీన్ సంజయ్ తదిరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత బొమ్మకు మురళి, దర్శకులు ప్రేమరాజ్.. ఈ చిత్రం రూపకల్పనలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. కథ, కథనాలతోపాటు.. రవి కళ్యాణ్ సంగీతం, సుద్దాల సాహిత్యం, పరుచూరి వెంకటేశ్వరావు తదితరుల నటన.. “శరణం గచ్ఛామి” చిత్రానికి ముఖ్య ఆకర్షణలని పేర్కొన్నారు.  ఇంత మంచి చిత్రంలో భాగస్వాములు అయినందుకు పరుచూరి, సుద్దాల, హీరో నవీన్ సంజయ్ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చిత్ర బృందానికి జ్ఞాపికలు అందజేశారు!!

 

Stills

About CineChitram

Check Also

21 కి వాయిదా పడ్డ “రిజర్వేషన్” !!

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. “డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్”తో కలిసి..  స్వీయ రచన మరియు దర్శకత్వంలో బహుముఖ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading