⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠⁠ప్ర‌శాంతి నిల‌యంలో షూటింగ్ జ‌రుపుకొంటున్న “ శ్రీ స‌త్య‌సాయి బాబా “

 సౌభాగ్య చిత్ర , ఎస్.సి.టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం – “శ్రీ స‌త్య‌సాయి బాబా “. ` అమ్మోరు `, ` అరుంధ‌తి` , `దేవుళ్లు ` , వంటి విజువ‌ల్ వండ‌ర్స్ ని  అందించిన కోడి రామ‌కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్మ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రాటం రాంబాబు నిర్మాత . పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి బాబా పై తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాల్ని అందిస్తున్నారు. జొన్న‌విత్తుల సింగిల్ కార్డులో 14 పాట‌ల‌కు సాహిత్యం అందిచ‌డం విశేషం . ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నారు. ఎదైతే  పుట్ట‌ప‌ర్తిలో జ‌రిగిన సంఘ‌ట‌నల్ని య‌థాత‌థంగా ఈ సినిమాని తీస్తున్నాం. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ని రామానాయుడు స్టూడియోస్ లో వేసిన “ప్ర‌శాంతి నిల‌యం “భారీ సెట్ లో నెల రోజుల షూటింగ్ జ‌రుగుతోంది. మార్చి 10 వ‌ర‌కు ఈ షెడ్యూల్ జ‌రుగుతుంది. ఈ సినిమా “ స‌త్య‌సాయి బాబా “ జీవిత చ‌రిత్రని చూపించే అపురూప‌మైన  చిత్రం ఇది. ప్ర‌పంచంలోనే ఎక్క‌డ లేని విధంగా స‌త్య‌సాయి గారు చేప‌ట్టిన క్యాష్ లెస్ ప్రీ హార్ట్ స‌ర్జ‌రీ , అన్ని ఫ్రీ గా ఇచ్చేట్టు పుట్ట‌ప‌ర్తిలో ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే . ఇప్ప‌టికి కూడా ఇది అమలు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఎన్నో అద్భుత‌మైన విష‌యాల గురించి తెలియ చెప్పే దే ఈ చిత్రం.
 
స‌త్య‌సాయిగా మ‌ల‌యాళ న‌టుడు శ్రీజిత్ విజ‌య్ నటిస్తున్నారు. స‌త్య‌సాయికి మాతృమూర్తిగా జ‌య‌ప్ర‌ద , తండ్రి పాత్ర‌లో శ‌ర‌త్ బాబు న‌టిస్తున్నారు.  ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ కి మేక‌ప్ మేన్ గా ప‌నిచేసిన ర‌మేష్ మెహంతి ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు. ఇప్పిటికే పాట‌ల రికార్డింగ్ పూర్త‌యింది. మంగళంప‌ల్లి బాల ముర‌ళి కృష్ణ త‌న చివ‌రి సినిమా సాంగ్ కూడా ఈ సినిమానే కావ‌డం విశేషం. ఈ సినిమా పాటల్లో ఆయ‌న పాట హైలెట్ గా నిలుస్తుంది. ఇప్ప‌టికే  ఈ సినిమాకి ఎస్.పి . బాల‌సుబ్ర‌మ‌ణ్యం , వందేమాతరం శ్రీనివాస్ , చిత్ర ,హ‌రిచ‌ర‌ణ్ , విజ‌య్ ప్రకాష్ , క‌వితా కృష్ణ‌మూర్తి , కైలాస్ కేర్ , సుఖ్వింద‌ర్ సింగ్ , మ‌ల్లాడి బ్ర‌ద‌ర్స్ , ఆండ్రియా , టిప్పు , త‌దిత‌రులు గానాల‌పన చేశారు. ప్ర‌ఖ్యాత ఛాయ‌గ్రాహ‌కుడు వాసు ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. 

Stills

About CineChitram

Check Also

ఫణి ఫిలిం ఫ్యాక్టరీ “స్ట్రేంజర్” సెకండ్ షెడ్యూల్ పూర్తి !!

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం “స్ట్రేంజర్”.  మర్డర్ మిస్టరీ నేపథ్యంలో.. గోవా బ్యాక్ డ్రాప్ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading