హీరో Dr. నరేష్ ప్రారంభించిన ఆప్టెక్(Aptech) కంప్యూటర్ ఎడ్యుకేషన్

హైదరాబాద్ సాగర్ హైవే రోడ్ బి.యన్. రెడ్డి నగర్ లో అల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన అధ్యక్షులు  మహమ్మద్ ఖాదర్ ఘోరీ  సారధ్యం లో ఏర్పాటు చేసిన ఆప్టెక్(Aptech) కంప్యూటర్ ఎడ్యుకేషన్ బ్రాంచ్ ని హీరో Dr. నరేష్ ఫిబ్రవరి 19, ఆదివారం  ప్రారంభించగా షాద్ నగర్ మాజీ ఎం.యల్.ఏ. సి . ప్రతాప్ రెడ్డి ఏవియేషన్ విభాగాన్ని ప్రారంభించారు. హీరో నరేష్ ప్రసంగిస్తూ మా ఫామిలీ అభిమాని ఖాదర్ ఘోరీ విద్య రంగం లో కూడా తన సేవలను అందించాలని ఈ సమస్త ను స్థాపించడం ఆనందంగా ఉంది అని విజయ వంతంగా నడవాలని కోరుకుంటూ ఆప్టెక్ టీం కి అభినందనలు తెలియజేసారు. సి . ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పలు సినీ సామజిక సేవ కార్యక్రమాలు నిర్వహించే ఘోరీ ఈ రంగం లోను విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేసారు . 

ఘోరీ సమస్త గురించి వివరిస్తూ, ఆప్టెక్ ద్వారా వివిధ రకాలైన కోర్సులను భోధించడమే కాకుండా ఉద్యోగ అవకాశాలను పొందే మార్గాలను కూడా ఆ సమస్తల ద్వారా చూపిస్తున్నట్టు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల్సింది గా కోరారు . 

ఈ కార్యక్రమం లో L.B.నగర్ M.L.A- R. క్రిష్నయ్య , షాద్ నగర్ M.L.A. వై. అంజయ్య యాదవ్ . టి . ఆర్ . యస్ . లీడర్ అందే బాబయ్య , ఆప్టెక్ సి .ఈ .ఓ . అక్షయ్ , సమస్త నిర్వాహకులు యస్ . వికాస్ రెడ్డి , జయ శ్రీ , పాల్గొని ప్రసంగించగా, నవాజ్ ఘోరీ, సాదిఖ్  ఘోరీ , యస్ . అహ్మద్ , జహంగీర్ , మల్లికార్జున్ , మానస , ముట్ట గంగాధర్ , జి . నాగలక్ష్మి , గంజి శశి కుమారి తదితరులు శుభాకాంక్షలు తెలియజేసారు 

Stills

About CineChitram

Check Also

త‌ల‌సాని, వినాయ‌క్ తో `కృష్ణ` నిర్మాత నూత‌న కార్యాల‌యం ప్రారంభం!!

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading