గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ సారధ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటా పురం. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇదే ఊపుతో సెకండ్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
హైదరాబాద్ లోని శాన్ ఫ్రాన్సిస్కో కాలేజ్ లో సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. వేణు ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో నిఖిల్ నటించిన స్వామి రారా, నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో చిత్రాలకు వేణు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు.
ఈ చిత్రంలో హ్యాపీడేస్ లో టైసన్ క్యారెక్టర్ తో మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ హీరోగా నటిస్తున్నారు. రాహుల్ డిఫరెంట్ లుక్ తో, ఆటిట్యూడ్ తో కనిపించబోతున్నారు. బాలీవుడ్ టీవీ ఆర్టిస్ట్ మహిమా మక్వాన్ హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చు సంగీత దర్శకత్వం వహించాడు. సాయి ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. కాశీ విశ్వనాథ్, అజయ్, జోగి బ్రదర్స్, అనితా, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రాన్ని శ్రీయాస్ శ్రీనివాస రావ్, తుము ఫణి కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… వెంకటా పురం ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది. ఇండస్ట్రీ పెద్దలు సైతం ప్రశంసించడం విశేషం. ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ లుక్ కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటుంది. రాహుల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. దర్శకుడు వేణు డిఫరెంట్ కథను, తనదైన స్క్రీన్ ప్లేతో ఎంటర్ టైనింగ్ గా చెప్పబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
నటీనటులు – రాహుల్, మహిమా మఖ్వానా, అజయ్, జోగి బ్రదర్స్, కాశి విశ్వనాథ్, శశాంక్
సాంకేతిక నిపుణులు
ఆర్ట్ – జె. మోహన్
కెమెరామెన్ – సాయి ప్రకాష్
మ్యూజిక్ – అచ్చు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – వేణు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – తాళ్లూరి ఆనంద్
ప్రొడ్యూసర్ – ఎంవివి సత్యనారాయణ
లైన్ ప్రొడ్యూసర్ – కె.అరున్ మోహన్
ప్రొడక్షన్ కంట్రోలర్ – వాసిరెడ్డి సాయిబాబు
డ్యాన్స్ మాస్టర్స్ – అనీష్ విగ్నేష్, అనితా నాథ్
పి.ఆర్.ఓ – ఎస్.కె.ఎన్. ఏలూరు శ్రీను
లిరిసిస్ట్ – అనంత శ్రీరాం, వనమాలి, అజయ్ కుమార్
ఎడిటింగ్ – మధు
స్టోరీ, డైరెక్షన్ – వేణు మడికంటి

Stills
Launch Photos