ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తి ని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మోహన్‌బాబు పులి మామిడి నిర్మిస్తోన్న చిత్రం ‘శివ కాశీపురం’. రాజేష్ చక్రవర్తి, ప్రియాంక శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ వట్టికూటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా
దర్శకుడు హరీష్ వట్టికూటి మాట్లాడుతూ – ”ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తిగారి మనవడు రాజేష్ శ్రీ చక్రవర్తిని మా శివ కాశీపురం చిత్రంతో పరిచయం చేయడం ఆనందంగా ఉంది. మహా శివరాత్రి సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం అదృష్టంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. సినిమా విజయంపై టీమంతా ధీమాగా ఉన్నాం` అని అన్నారు.
నిర్మాత మోహన్‌బాబు పులిమామిడి మాట్లాడుతూ ` చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఫ్యాషన్. దేవుడి కృపతో శివ కాశీపురం సినిమాకు నిర్మాతగా మారాను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్స్‌లో చక్రవర్తిగారు ఒకరు. ఆయన మనవడిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఇంకా ఆనందంగా ఉంది. డైరెక్టర్ హరీష్‌గారు గతంలో చేసిన షార్ట్ ఫిలిం చూసి అవకాశం ఇచ్చా. సినిమా బాగా వస్తుంది” అన్నారు.
హీరో రాజేష్ శ్రీ చక్రవర్తి మాట్లాడుతూ – ”డైరెక్టర్‌గారు చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను. తమిళ్ ఫ్లెవర్‌తో చాలా గ్రాండియర్ లుక్‌లో సినిమా ఉంటుంది. నన్ను హీరోగా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో దిల్ రమేష్, హీరోయిన్ ప్రియాంక శర్మ పాల్గొన్నారు.
దిల్ రమేష్, చమ్మక్ చంద్ర, జబర్‌దస్త్ రాము, మాస్టర్ హరీశ్వర పులి మామిడి, జబర్‌దస్త్ నవీన్, కళ్యాణి, సత్యప్రియ, రవీంద్ర, వైజాగ్ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: పవన్ శేష, కెమెరా: జయ జి.రాంరెడ్డి, ఎడిటర్: జియో థామస్, నిర్మాత: మోహన్‌బాబు పులి మామిడి, రచన, దర్శకత్వం: హరీష్ వట్టికూటి.