సాహస౦ స్వాసగా సాగిపో – సినిమా సమీక్ష

సాహస౦ స్వాసగా సాగిపో - సమీక్ష

సినీ చిత్ర౦ రేటి౦గ్ - 2.74

2.7

బాలేదు

ప్రేక్షకుడు కి కాసింత బోర్ కొట్టిన సాహసాన్ని సాగేలా చూస్తాడు.

User Rating: No Ratings Yet !
  • తారాగణ౦: 

    • నాగచైతన్య
    • మ౦జిమ మోహన్ Mohan
    • బాబా సెహ్ గల్

    చైతు మీద ప్రేక్షకులకు ఓ ముద్ర పడిపోయింది తను అయితే ప్రేమ కథ ల కు న్యాయం చేస్తాడు సరదా గ పోయి చూసి రావచ్చు అంతే కాకుండా ఈ సవంత్సరం ప్రేమము అనే మలయాళం చిత్రం తో వచ్చి తన కెరీర్ లోనే మంచి కలెక్షన్ లు సాధించిన సినిమా గా మలుచుకొని. ఆల్రెడీ క్రేజీ డైరెక్టర్ గ గుర్తింపు వున్నా గౌతమ్ మీనన్ తో కలిసి సాహసం శ్వాస గా సాగిపో అనే సినిమా తో మన ముందుకు వస్తున్నాడు. వీళ్ల కాంబినేషన్ లో సినిమా అంటే నే యూత్ లో ఓ క్రేజ్ అల ఉండిపోయింది. మరి ఈ సాహసం సరిగానే సాగిందో లేదో చూద్దాం

    కథ:

    హీరో పేరు సినిమా లో రివీల్ చెయ్యలేదు అది తెర పైన తెలుస్కోగలరు. (రకెండు మౌళి) మహేష్ తన ఫ్రెండ్స్ అందరికి హీరో లవ్ స్టోరీస్ చెప్తూ సరదాగా తన లైవ్ స్టొరీ 2, 3 చెప్తాడు కాని హీరో తన లవ్ స్టొరీ 1 తన బైక్ అనే చెప్తాడు. ఇంతలో హీరో (నాగ చైతన్య) తన చెల్లి అయిన మైత్రెయి కి ఎవరో కాలేజీ కి వెళ్లి మరి తనని ఇబ్బంది పెడుతున్నాడు అని ఫ్రెండ్స్ కి చెప్పి వాళ్లతో వెళ్లి ఇబ్బంది పెడుతున్నవాడికి వార్నింగ్ ఇస్తాడు. అదే కాలనీ లో హీరో ఫ్రెండ్ (రాకెండు మౌళి) అయిన మహేష్ తన లవర్ ని కలవడానికి హీరో ని తీసుకువెళ్తాడు అక్కడ హీరో వెయిట్ చేస్తూ ఉండగా అంతకు ముందు హీరో వార్నింగ్ ఇచ్చినవాడు నలుగురి ని తీసుకుని తన మీదకి వస్తే తను ఎలా ఎదురుకున్నాడు అన్నది వాలా ఫ్రెండ్స్ కి చెప్తూ జీవితం లో ఏదైనా ఎదురాయితే తను హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెంట్ తన లో ఉంది అని చెప్తాడు. హీరో కి తన చెల్లెలు ఫ్రెండ్ అయిన లీల ( మంజిమ మోహన్). వీళ్లిద్దరూ ఓ డైరెక్టర్ దగ్గర ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు అల కోర్స్ చెయ్యడానికి వచ్చిన లీల మైత్రేయి వాలా ఇంట్లో ఉంటుంది. అల ఇంట్లో ఉన్న లీల తో హీరో కి పరిచయం ఏర్పడుతుంది. వీరి మాటల పరిచయం లో హీరో తన కు ఎం ఇష్టమొ చెప్తూ మరి ముఖ్యం గా తనకు బైక్ రైడింగ్ అంటే ఇష్టం తనకి అల ఫ్రెండ్స్ తో రైడ్ కి పోయి కన్యాకుమారి లో సన్ రైజ్ చూడాలి అని తన కోరిక తనకి చెప్తూ వుంటాడు. అల వెళ్ళటానికి తన ఫ్రెండ్స్ వస్తా అని హ్యాండ్ ఇస్తూనారు అని చెప్తాడు. కాని ఈ సారి ఎలాగైన సన్ రైజ్ చూడాలి అని చెప్తాడు. అల వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్లకి తెలియనివ్వదు అని లీల కి చెప్తాడు . లీల కూడా తన కోర్స్ కంప్లీట్ అయి ఇంటికి వెళ్ళిపోతున్న అని చెప్తుంది. అల ఇంటికి వెళ్తున్న అన్న లీల తనాతో టూర్ కి రావడానికి ఇష్టపడుతుంది. అల వెళ్లిన వీళ్లకి యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే హీరో హాస్పిటల్ లోనే ఉంటాడు లీల తన పేరెంట్స్ కి ఏదో ప్రాబ్లం రావటం వల్ల తనని వదిలి వెళ్లాల్సి వచ్చింది అని చెప్తుంది. ఇంతకీ ఎం ప్రాబ్లం? లీల మల్లి హీరో ని కలుస్తుందా? లేక హీరో నే లీల ని కలుస్తాడా? లీల ప్రొబ్లెంస్ ని హీరో నే సాల్వ్ చేస్తాడా? లేక హీరో వల్లే తనకి ప్రొబ్లెంస్ ఆ?

     

    నటీ నటుల అభినయ౦:-

    నాగ చైతన్య :

    గౌతమ్ మీనన్ చేతిలో సినిమా అన్న లవ్ స్టోరీస్ అన్న చైతు తన దైన ముద్ర వేసేసుకున్నాడు అలంటి సినిమా చేతిలో ఉంటే చైతు ఉరుకుంటాడా తన నటనతో సినిమా ని నిలబెట్టాడు అనే చెప్పాలి మరి ముఖ్యం గా హీరోయిన్ తో వచ్చే సన్నివేశాలు పాటల లో తను చూపించే హావ బావలు అంతె కాకుండా ఈ సినిమా లో యాక్షన్ సీన్స్ లో కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. సినిమా అల సాగిపోవాటానికి చైతు చాల ప్లస్ అయ్యాడు అని చెప్పాలి.

    మంజిమా మోహన్:

    నూతన నటి అయినప్పటికీ చాల బాగా నే చేసింది అని చెప్పొచ్చు ఆమే స్క్రీన్ ప్రెజెన్సు బాగుంది ఎమోషన్స్ లో నటించిన తీరు బాగుంది. రకెండు మౌళి ( హీరో ఫ్రెండ్): తన నటన బాగానే ఆకట్టుకుంది తను వచ్చే సీన్స్ లో బాగానే నవ్వించాడు. తను రాసిన పాట ( షోకి ల్ల) బాగుంది.

    దర్శకుడు: గౌతమ్ మీనన్:

    ప్రేమ సినిమాలు మరియు థ్రిల్లర్ మూవీస్ లో ఈయనికి ఓ మార్క్ ఉంది. ఆ మార్క్ కి తీసిపోకుండా ప్రేమ, థ్రిల్లర్ మరియు యాక్షన్ కధాంశం తో తీసిన ఈ సినిమా లో అక్కడక్కడా నిరుపోయోగ్యమాయినా సన్నివేశాలు వచ్చిన సినిమా అల సాగుతూనే ఉంటది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్న సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ మీద కాస్త పట్టు జారింది అని చెప్పుకోవచ్చు ఫైనల్ గా సత్య దూరమైన ఫీనిషింగ్ తో ప్రేక్షకులను కాసింత నిరాశ పరిచాడు. అయినప్పటికీ మంచి మార్కులే ఇవ్వచ్చు ఇలాంటి కొత్త తరహా కథలను చూపించాటానికి ఎప్పుడు ధైర్యం చేస్తూనే ఉంటాడు కాబట్టి ఈయన ని మెట్చిన ప్రేక్షకులు ఈ సినిమా తో సంతృప్తి చెందగలరు. అన్ని వర్గాల ప్రేక్షకుల ను ఆకట్టుకునే విషయం లో ఫెయిల్ అయినట్టే.

    సంగీత దర్శకుడు: ఏ ఆర్ రెహమాన్:

    ఈ సినిమా కి వెన్నముక అని చెప్పొచ్చు పాటలు మరియు నేపధ్య సంగీతం చాల చాల బాగున్నాయి. రెహ్మాన్ సంగీతం కాకపోయి ఉంటె సినిమా కి బలమే ఉండదు.

    సా౦కేతికా౦శాలు:-

    కెమెరా పని తనం బాగానే ఉంది మరి ముక్యంగా ఇంటర్వెల్ లో వచ్చే సన్నివేశాల్లో ఎడిటింగ్ కాని పిక్చరిజేషన్ అక్కడ వెళ్ళిపోమాకే అనే పాట రావటం చాల బాగుంది. ఆ పాట ఎందుకు అన్న ప్రేక్షకుడుకి సమాధానము చెప్తున్నట్టే ఉంటది కాస్త డిఫరెంట్ గా

     

    బాగున్నదేవిటి:-

    చైతు మరియు మంజిమా మోహన్

    పాటలు బాక్గ్రౌండ్

    ఇంటర్వెల్ తీసిన విధానం

    బాలేనిదేవిటి:-

    స్క్రిప్ట్

    క్లైమాక్స్

    పాటల ప్లేస్ మెంట్

    ఇలా చేస్తే బాగు౦డేది :-

    గౌతమ్ మీనన్ విధానం బాగానే ఉన్నా కాస్త కామన్ ఆడియన్స్ మెప్పించే లా చేసి ఉంటే బాగుండేది టూర్ విషయంలో కన్యాకుమారి అటు నుంచి మహారాష్ట్ర చాల నే టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయ్ అవి కాస్త ప్రేక్షకుడుకి కనువిందు అయ్యేలా చేసి ఉండల్సింది మరి ముఖ్యం గా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ఉన్న యాక్షన్ సన్నివేశాల కి కాస్త తగ్గించాల్సింది లాస్ట్ లో క్లైమాక్స్ కూడా బలం చేకూరే లా చేసి ఉంటె ప్రేక్షకుడు బయటకి వచ్చే టప్పుడు కాస్త థ్రిల్ ఫీల్ అయ్యేవాడు. స్లో నేరేషన్ కామన్ ఆడియన్స్ కూడా దృష్టిలో ఉంచుకుని ఉన్నట్లు అయితే ఇలాంటి సినిమా లో మరింత విజయాన్ని వెనకేసుకునేవాడు.

    చివరిగా:-

    ప్రేక్షకుడు కి కాసింత బోర్ కొట్టిన సాహసాన్ని సాగేలా చూస్తాడు.

About CineChitram

Check Also

ఎక్కడికి పోతావు చిన్నవాడా – సినిమా సమీక్ష

తారాగణ౦: నిఖిల్‌, హెబాప‌టేల్‌, నందిత శ్వేత‌(ప‌రిచ‌యం), వెన్నెల కిషోర్‌, తనికెళ్ళ భ‌ర‌ణి, స‌త్య‌, తాగుబోతు ర‌మేష్‌, జోష్ రవి, వైవా …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading