విడుద‌ల‌కు ముస్తాబ‌వుతున్న `అటు ఇటుకాని హృద‌యం తోటి`!

లిపి భార్గ‌వ ప్రొడ‌క్ష‌న్స్, విమ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బేన‌ర్స్ పై డి.వి.కృష్ణ మోహ‌న్, జి.ఆంజ‌నేయులు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `అటు ఇటుకాని  హృద‌యం తోటి`. జ‌గ‌దీష్, శుభాంగి జంట‌గా న‌టిస్తోన్నఈ చిత్రం ద్వారా  జె.కె.జి ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ కి సిధ్ద‌మైంది. ఇటీవ‌ల మ‌ధుర ఆడియో ద్వారా విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత డి.వి.కృష్ణ‌మోహ‌న్ మాట్లాడుతూ…“నిల‌క‌డ‌లేని మ‌న‌స్త‌త్వం క‌లిగిన అబ్బాయి…సున్నిత మ‌న‌స్తత్వం క‌లిగిన అమ్మాయి ప్రేమ‌లో ప‌డితే ఆ త‌ర్వాత వారి జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నేది చిత్ర క‌థాంశం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా తీర్చిదిద్దాము. హైదారాబాద్ ,రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, వైజాగ్  ప‌రిస‌ర ప్రాంతాల్లో  చిత్రీక‌రించాము. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వ‌చ్చింది. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలూ పూర్తి చేసి సినిమాను గ్రాండ్ గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
జ‌గ‌దీష్‌, శుభాంగి, క్రిష్ణ మోహ‌స‌న్ డి.వి;  కె.య‌స్.య‌స్‌. ప్ర‌సాద్;  సుధావాణి, రాఘ‌వ‌రావు, క‌ల్ప‌న త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః సునీల్; ఎడిటింగ్ః జి.య‌స్‌.చౌద‌రి; స‌ంగీతంః జి.పి.ర‌వీన్‌;  పాట‌లుః జె.కె;  సింగ‌ర్స్ః సునీత‌, గీతా మాధురి, సాకేత్‌, విశ్వ‌, ప్ర‌వీణ్‌, పీఆర్వోః వంగాల కుమార స్వామి;  నిర్మాత‌లుః డి.వి.కృష్ణ మోహ‌న్, జి.ఆంజ‌నేయులు; క‌థ‌-స్ర్కీన్ ప్లే-ద‌ర్శ‌కత్వంః జె.కె.జి.

About CineChitram

Check Also

21 కి వాయిదా పడ్డ “రిజర్వేషన్” !!

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. “డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్”తో కలిసి..  స్వీయ రచన మరియు దర్శకత్వంలో బహుముఖ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading