అల్లరి నరేష్ తాజా చిత్రం మేడమీద అబ్బాయి ప్రారంభం!

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఒరు వడక్కం సెల్ఫీ చిత్రానికి రీమేక్ ఇది. మాతృకకు దర్శకుడైన జి.ప్రజిత్ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌నివ్వగా, నూజివీడు సీడ్స్ వైస్ ఛైర్మన్ రామకోటేశ్వరరావు కెమెరా స్విఛాన్ చేశారు. తొలి సన్నివేశానికి భీమినేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ నా 53వ సినిమా ఇది. ఎప్పుడూ కామెడీ సినిమాలే చేస్తున్నావు. దానినుంచి బయటపడి కొత్తగా ఏమైనా చేయొచ్చు కదా? అని చాలా మంది అడుగుతున్నారు. గమ్యం శంభో శివ శంభో తర్వాత అలాంటి విభిన్నమైన  కథాంశాల కోసం చాలా రోజులు ఎదురుచూశాను. ఒరు వడక్కం సెల్ఫీ రూపంలో ఆ స్థాయి కథ దొరికింది. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. కెరీర్‌లో మొదటిసారి నేను థ్రిల్లర్ కథ చేస్తున్నాను. నా శైలి వినోదంతో ప్రేక్షకుల్ని ఆకట్టకుంటుంది అన్నారు. ఒరు వడక్కం సెల్ఫీ నా ఫేవరేట్ మూవీ. ఎన్నోసార్లు సినిమా చూశాను. నరేష్‌ను కొత్తగా చూపించే కథ కోసం నాలుగేళ్లుగా అన్వేషిస్తున్నాను. ఈ సినిమాతో ఆ లోటు తీరిపోతుంది. ఈ నెల 16 నుంచి పొల్లాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత పేర్కొన్నారు. మలయాళంలో రెండొందల రోజులు ప్రదర్శింపబడిన చిత్రమిదని సంగీత దర్శకుడు డి.జె.వసంత్ తెలిపారు. తెలుగులో తనకిది తొలి చిత్రమిదని, గతంలో తమిళం, మలయాళంలో రెండేసి చిత్రాల్లో నటించానని కథానాయిక నిఖిలా విమల్ పేర్కొన్నారు. అవసరాల శ్రీనివాస్, జయప్రకాష్, తులసి, సుధ, సత్యం రాజేష్, మధునందన్, జబర్దస్త్ ఆది, పద్మ జయంతి, రవిప్రకాష్, వెన్నెల రామారావు, సంధ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్ (పిల్ల జమీందార్ ఫేమ్), సినిమాటోగ్రఫీ: ఉన్ని ఎస్ కుమార్, సంగీతం: డి.జె.వసంత్, ఆర్ట్: రాజీవ్ నాయర్, ఎడిటర్: నందమూరి హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.ఎస్.కుమార్, సమర్పణ:  శ్రీమతి నీలిమ, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.ప్రజిత్.
 

Stills

About CineChitram

Check Also

గంటా రవి, జయంత్‌ సి. పరాన్జీల ‘జయదేవ్’ 3వ సాంగ్ ప్రోమో విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading