కత్తి పట్టిన పిఠాపురం ఎమ్మెల్యే! | CineChitram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు ఆరు నెలల కాలం నుంచి రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పవన్.. ‘హరిహర వీరమల్లు’ సినిమా సెట్‌కి తిరిగి రావడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. విజయవాడలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈరోజు ఉదయం 7 గంటలకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ను పవన్ ప్రారంభించినట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది

. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించారు. మార్చి 28, 2025న పాన్ ఇండియా సినిమాగా ‘హరిహర వీరమల్లు’ ఇతర భారతీయ భాషల్లో కూడా విడుదల కాబోతున్నట్లు వారు ప్రకటించేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ‘పవన్ కళ్యాణ్’ కత్తి పట్టుకుని ఉన్న లుక్ అభిమానులను థ్రిల్ చేస్తుంది.

డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్షన్‌ లో  ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో పవన్‌ సరసన నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన తరువాత తప్పుకున్నారు.

The post కత్తి పట్టిన పిఠాపురం ఎమ్మెల్యే! first appeared on Andhrawatch.com.

About

Check Also

Lokah Chapter 1 finally arrives on OTT | CineChitram

The Mollywood sensation Lokah Chapter 1 has a phenomenal theatrical run and has now finally …