స్టార్ హీరో కుమారులు అంటే సహజంగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటారు. కానీ, హీరో రవితేజ వారసుడు మహాధన్ భూపతిరాజు మాత్రం దానికి భిన్నంగా ఆలోచించాడు. మహాధన్ ప్రస్తుతానికి డైరక్షన్ ఫీల్డ్ ను ఎంచుకున్నాడు. పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర మహాధన్ భూపతిరాజు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడంట.
‘సందీప్ రెడ్డి డైరెక్షన్’ అంటే మహాధన్ కి చాలా ఇష్టం అని తెలుస్తుంది. అందుకే, ఆయన దగ్గర సహాయకుడిగా జాయిన్ అయినట్టు సమాచారం. మరి భవిష్యత్ లో మహాధన్ డైరక్టర్ గానే సెటిల్ అవుతారో, లేక.. హీరోగా మారతారో వేచి చూడాలి. రవితేజ అభిమానులు మాత్రం మహాధన్ భూపతిరాజు హీరో కావాలని ఆకాంక్షిస్తున్నారు. రవితేజ కూడా మొదట అసిస్టెంట్ డైరక్టర్ గా చేశాడని, అలాగే, మహాధన్ భూపతిరాజు కూడా ప్రస్తుతానికి అసిస్టెంట్ డైరక్టర్ గా చేసినా, భవిష్యత్తులో కచ్చితంగా హీరో అవుతాడని అభిమానులు అనుకుంటున్నారు.
The post కాదు..కాదు డైరెక్షన్ వైపే! first appeared on Andhrawatch.com.