కేరాఫ్ గోదావరి ప్రచార గీత౦ విడుదల

ఉషా మూవీస్ సమర్పణలో ఆర్ ఫిల్మ్ ఫాక్టరీ & ప్రొడక్షన్స్, బొమ్మనా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కేరాఫ్ గోదావరి. అతిత్వరలో ఆడియో మరియు సినిమా విడుదల జరుపుకోతున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ పారిశ్రామికవేత్త రవీందర్ సిరిగిరి తనయుడు… “రోహిత్ ఎస్” హీరోగా పరిచయం అవుతున్నారు. రాజా రామ్మోహన్ దర్శకత్వంలో తూము రామారావ్ (బాబాయ్), బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేరాఫ్ గోదావరి ఒక అందమైన, ఆహ్లాదకరమైన ప్రేమకథ. అచ్చమైన ఆంధ్రాభోజనం లాంటి సినిమాను చూపిచబోయే ముందు ప్రేక్షకులకు ఒక మంచి స్టార్టర్ అందించే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రమోషనల్ వీడియో సాంగ్ ఈ రోజు విడుదల చేస్తున్నారు. “పెంచెయ్ రా మ్యూజిక్” అంటూ హుషారుగా సాగే ఈ ఫాస్ట్ హిప్ హిప్ సాంగ్ లో హీరో రోహిత్ తనలోని డ్యాన్సింగ్ టాలెంట్ చూపించడం ప్రత్యేకత.

 

గిరి కోడూరి రచించిన ఈ పాటను ఇటీవలే విడుదలైన సూర్య చిత్రం “24” లో “ప్రేమస్వరములు” పాటతో పాటు, హిందీ చిత్రం “బాంజో”లో “ఉడంచూ” పాటను పాడిన ప్రముఖ గాయకుడు హృదయ్ గటానీ పాడడం విశేషం. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని “మ్యూజిక్ నీడ్స్ యూ” లో మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ జరుపుకున్న ఈ పాట ఆడియో  నిన్న అనగా 1 నవంబర్ నాడు ప్రముఖ ఎఫ్ ఎం ఛానల్ బిగ్ ఎఫ్ ఎం లో విడుదల చేయడం జరిగింది. యూట్యూబ్ లో కేరాఫ్ గోదావరి ఛానల్ లో ప్రేక్షకులు ఈ వీడియోను చాడవచ్చు. ఇప్పటికే మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈ పాటతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు రఘుకుంచే స్వరపరచిన చిత్రంలోని మిగిలిన పాటలు కూడా ప్రేక్షకదేవుళ్ళను ఆకట్టుకుంటాయని ఆకాంక్షిస్తున్నాం. 

About CineChitram

Check Also

నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన “అమీ తుమీ” టీజర్

ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ “అమీ …

Leave a Reply

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading