చిల్డ్ర‌న్స్ డే సంద‌ర్భ‌గా `తారాజువ్వ‌లు` టీజ‌ర్ విడుద‌ల‌

హెచ్‌.వై. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై దర్శకుడు మహేష్ కత్తి డైరెక్షన్‌లో నాగ‌మ‌ల్లా రెడ్డి నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `తారాజువ్వ‌లు`. ఈ సినిమా టీజ‌ర్‌ను చిల్డ్ర‌న్స్ డే రోజున టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ క‌త్తి మాట్లాడుతూ – “నా గురువు, మెంట‌ర్ అయిన త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ గారికి, చిత్ర నిర్మాత నాగ‌మ‌ల్ల రెడ్డి ఇర‌గంల‌కు ముందుగా నా కృత‌జ్ఞ‌త‌లు. `తారాజువ్వ‌లు` సినిమా విష‌యంలో వీరిందిస్తున్న స‌హ‌కారం మ‌రువ‌లేనిది. ఈ చిల్డ్ర‌న్స్ డే సంద‌ర్భంగా తారాజువ్వ‌లు టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి  రఘునాథ్ ఎడిటింగ్ వ‌ర్క్‌, వినోద్ రాజేంద్ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ, ఘంట‌శాల విశ్వ‌నాథ్ సంగీతంను అందిస్తున్నారు. నా కోడైరెక్ట‌ర్ కార్తీక్ మేడికొండ‌, నా డిజైన‌ర్ నిహారిక రెడ్డిల స‌హ‌కారం మ‌రువ‌లేను. అలాగే ఈ చిత్రానికి భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్‌, శ్రేష్ఠ అద్భుత‌మైన సాహిత్యానందించారు“ అన్నారు.  
చిత్రంలో అజ‌య్ ఘోష్‌,విశ్వనాథ్, సౌమ్య వేణుగోపాల్‌, కోమల, కార్తీక్, సాత్విక్, శ్రీమాధ‌వి చంద్ర కూచిబొట్ల‌, సురేష్ లొలిత్ కుమార్‌, స్వ‌ప్న‌, సుజాత స‌హా పలువ‌రు బాల‌నటీన‌టులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు

Video

About CineChitram

Check Also

`మెట్రో` గీతామాధురి సాంగ్‌ని లాంచ్ చేసిన సునీల్‌

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading