ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కృష్ణ చైతన్య సమర్పణలో స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమా బ్యానర్స్ సంయుక్తంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. గతేడాది రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ బ్యానర్‌పై విడుదలైన నేను శైలజ ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. నేను శైలజ చిత్రంలో హీరో రామ్‌ను సరికొత్తగా ప్రెజంట్ చేసిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రంలో సరికొత్త లుక్, బాడీలాంగ్వేజ్‌తో చూపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. నేను శైలజ చిత్రాన్ని అద్భుతమైన మ్యూజిక్‌ను అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తుండగా సిరి వెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ ఎ.ఎస్.ప్రకాష్ అందిస్తున్నారు. ఈ కొత్త చిత్రం ఏప్రిల్ 25 నుండి ప్రారంభం కానుందని నిర్మాతలు తెలియజేశారు.
Tags anupama parameswaran megha meghana ram
Check Also
మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’
శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …
Cine Chitram Telugu Cinema World
