Sunday , January 19 2020
Home / ప్రముఖులు / తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మంచి నిర్మాత‌నే కాదు, మంచి వ్య‌క్తిని కోల్పోయిందిః నంద‌మూరి బాల‌కృష్ణ‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మంచి నిర్మాత‌నే కాదు, మంచి వ్య‌క్తిని కోల్పోయిందిః నంద‌మూరి బాల‌కృష్ణ‌

[et_pb_section admin_label=”section”][et_pb_row admin_label=”row”][et_pb_column type=”4_4″][et_pb_text admin_label=”Matter” background_layout=”light” text_orientation=”left” use_border_color=”off” border_color=”#ffffff” border_style=”solid”]

“ప్ర‌ముఖ సినీ నిర్మాత కె.సి.శేఖ‌ర్ బాబు క‌న్నుమూయ‌డం చాలా బాధాక‌రం.  నిర్మాత‌గా ఎన్నో మంచి చిత్రాల‌ను నిర్మించారు. ఆయ‌న నిర్మాణంలో నేను కూడా సాహ‌స సామ్రాట్ అనే సినిమా చేశాను. నాన్న‌గారు, స్వర్గీయ ఎన్టీఆర్‌గారితో సినిమా పరంగా ,కుటుంబ పరంగా కూడా త‌న తండ్రిగారి కాలం నుండి స‌త్సంబంధాలు ఉన్న వ్య‌క్తి శేఖ‌ర్‌బాబుగారు. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌తను సాధించుకున్న శేఖ‌ర్‌బాబుగారు ఫిలిం సెంట్ర‌ల్ బోర్డ్ చైర్మ‌న్ గా, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ సెక్ర‌ట‌రీగా గా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం ద‌క్షిణాది ఫిలించాంబ‌ర్ క‌మిటీ మెంబ‌ర్ గా సేవ‌లందిస్తూ అంద‌రికీ అందుబాటులో ఉండి క‌ళామ‌తల్లికి సేవ చేసిన వ్య‌క్తి. శేఖ‌ర్ బాబుగారి మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ మంచి నిర్మాత‌నే కాదు, ఒక మంచి వ్య‌క్తిని కోల్పోయిన‌ట్ట‌య్యింది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటూ, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేస్తున్నాను“ — నంద‌మూరి బాల‌కృష్ణ

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][/et_pb_section]

Comments

comments

About CineChitram

Check Also

సూపర్ స్టార్ కృష్ణ నరేష్ నవీన్ లను కలిసిన అభిమానులు

కువైట్ లో 8 సంవత్సరాలు గా  డిజైన్ వృత్తిలో  ప్రాముఖ్యత ను అందిపుచ్చుకున్న గుంటూరు ప్రాంత వాసి హుస్సేన్ మొహమ్మద్ …