భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పూరి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ‌ 101వ చిత్రం ప్రారంభం

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ  101వ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు   హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లి తుల‌సీవ‌నంలోని వెంక‌టేశ్వ‌ర స్వామి దేవాల‌యంలో జ‌రిగాయి. డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ప్రాంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో తొలి స‌న్నివేశానికి ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి క్లాప్ కొట్ట‌గా, నంద‌మూరి రామ‌కృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి స‌న్నివేశానికి బోయ‌పాటి శ్రీను గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా…
నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ – “ఆధ్యాత్మిక చింత‌న ఉన్న వి.ఆనంద్ ప్ర‌సాద్‌గారి నిర్మాణంలో పూరి జ‌గన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. అంద‌రూ నా 101వ సినిమా ఏదై ఉంటుంద‌ని ఎదురుచూస్తున్న త‌రుణంలో ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతోంది. అభిమానులు, ప్రేక్ష‌కులు కోరుకునేలా సినిమా ఉంటుంది. త్వ‌ర‌లోనే మిగ‌తా ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాలు తెలియ‌జేస్తాం“అన్నారు. 
వి.ఆనంద్ ప్ర‌సాద్ మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.8గా నంద‌మూరి బాల‌కృష్ణ‌గారు హీరోగా, పూరిగారి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డం ఎంతో హ్యాపీగా ఉంది. మా బ్యాన‌ర్‌కు క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ నెల 16 నుండి ఏక‌ధాటిగా షూటింగ్ చేస్తాం. సెప్టెంబ‌ర్ 29న సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకోవ‌డానికి ముందుగానే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌డం మంచి ప‌రిణామ‌మ‌ని అంద‌రూ అంటున్నారు“ అన్నారు. 
పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ – “ఎన్నాళ్ళుగానో వెయిట్ చేస్తున్న స‌మ‌య‌మిది. ఎప్ప‌టి నుండో బాల‌కృష్ణ‌గారితో  ఎప్ప‌టి నుండో సినిమా చేయాల‌నే ల‌క్ష్యం ఈ సినిమాతో నేర‌వేరింది. అభిమానులు బాల‌కృష్ణ‌గారి నుండి ఏ ఎలిమెంట్స్‌ను ఆశిస్తారో, అలా ఆయ‌న బాడీ లాంగ్వేజ్‌, లుక్ ఉంటుంది. సినిమాలో డైలాగ్స్ సీడీలో విడుదల చేసేలా ఉంటాయి  సినిమాను సెప్టెంబర్ 29న దసరా కానుకగా విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించాం. అయితే మంచి ముహుర్తం చూసుకుని రెండు, మూడు రోజులు ముందుగా అయినా విడుదల చేయడానికి మేం సిద్ధంగానే ఉంటాం.“ అన్నారు. 

Stills

About CineChitram

Check Also

మెగాబ్రదర్‌ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘కళ్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్‌ అండ్‌ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్‌ సంయుక్తంగా సత్య డైరెక్షన్‌లో నిర్మాత టి. రామకృష్ణ …

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading