స్పై క్యారెక్ట‌ర్ చేయ‌డం అంత సుల‌భం కాదు – తాప్సీ

తాప్పీ, అక్ష‌య్‌కుమార్‌, మ‌నోజ్ బాజ్‌పేయి, పృథ్వీరాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందిన చిత్రం `నామ్ ష‌బానా`.శివ‌మ్ నాయర్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా మార్చి 31న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా గురువారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో…

దర్శ‌కుడు శివ‌మ్ నాయ‌ర్ మాట్లాడుతూ – “ష‌భానా అనే అమ్మాయి క‌థే ఈ చిత్రం. ఓ సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి స్పైగా ఎలా మారింద‌నేదే క‌థ‌. బేబి సినిమా చూసిన త‌ర్వాత ఆ సినిమా ద‌ర్శ‌కుడు నీర‌జ్‌పాండేగారిని క‌లిసి ఈ క్యారెక్ట‌ర్ గురించి చెప్పాను. ష‌బానా అనే అమ్మాయికి ఒక బ్యాక్‌డ్రాప్ ఉంటే ఎలా ఉంటుంది అనే దాన్ని ఆయ‌న‌కు విడ‌మ‌రిచి చెప్పాను. ఆయ‌న‌కు న‌చ్చ‌డంతో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది“ అన్నారు. 

తాప్సీ మాట్లాడుతూ – “బేబి సినిమా విడుద‌లై, అందులో నా పాత్ర‌కు మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చిన త‌ర్వాత ఓ రోజు నీర‌జ్ పాండేగారు ఫోన్ చేసి, ష‌బానా క‌థ గురించి చెప్పి, నీకు ఓకేనా అని అడిగారు. నేను చేయ‌డానికి సిద్ధ‌మే..మీకు ఓకేనా అని అడిగాను. ఎందుకంటే బేబి సినిమాలో నాది ప‌దిహేను నిమిషాల ముఖ్య‌మైన పాత్ర‌. ఆ పాత్ర‌ను ప్ర‌ధానంగా చేసుకుని పూర్తిస్థాయి సినిమా చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. రీసెంట్‌గా సినిమాను పూర్తిగా చూసిన త‌ర్వాత థ్రిల్‌గా ఫీల‌య్యాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమా యూనిట్ ఎంత‌గానో స‌పోర్ట్ చేసింది. ఒక హీరోయిన్, హీరో స్థానంలో ఉండి సినిమాను ముందుకు న‌డిపించ‌డం గొప్ప విష‌యం. రానా ఈ చిత్రంలో న‌టించ‌లేదు. రానా త‌ప్ప బేబి చిత్రంలో న‌టించిన న‌టీన‌టులంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు. ఇది ప్రీక్వెల్ కాదు. ఒక క్యారెక్ట‌ర్ గురించి, డెప్త్‌గా చేసిన ఈ సినిమా స్పినాఫ్ అంటారు. మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయి స్పైగా ఎలా మారింద‌నేదే క‌థ‌. ఇండియన్ సినిమాలో ఇలాంటి క‌థ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌లేదు. ఈ సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్ ట్ర‌యినింగ్ తీసుకున్నాను. ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయ‌డం చాలా క్లిష్టం. చ‌ష్మే బ‌ద్దూర్ లో కామెడి రోల్‌, పింక్‌లో సీరియ‌స్ డ్రామా రోల్ చేశాను. ఈ సినిమ‌లోస్పై క్యారెక్ట‌ర్ చేశాను. జుడువా అనే సినిమాలో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తాను. ష‌బానా క్యారెక్ట‌ర్ షార్ట్ టెంప‌ర్‌, ఎగ్రెసివ్ క్యారెక్ట‌ర్‌. ఇలాంటి సినిమాలు చేయ‌డానికి నేను డైరక్ట‌ర్‌ను న‌మ్మి చేస్తాను. తెలుగులో పాఠ‌శాల ద‌ర్శ‌కుడు మ‌హి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాను“అన్నారు.

Stills

About CineChitram

Check Also

`మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` చిత్రంలోనా పాత్ర కొత్త త‌ర‌హా వినోదాన్ని అందిస్తుంది – పృథ్వీ

Discover more from Cine Chitram

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading